తెలంగాణలో మేడారం జాతర ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఈ జాతర కోసం ప్రజలు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో టీఎస్‌ఆర్టీసీ రంగంలోకి దిగింది. ప్రజలు ఆర్టీసీ బస్సులనే ఎక్కాలంటూ వినూత్నంగా ప్రమోషన్లు చేస్తోంది. గతంలో ఎన్నో కొత్త సినిమాలను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్‌ల కోసం వాడుకున్న టీఎస్‌ఆర్టీసీ తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు కొత్త సినిమా సర్కారు వారి పాటను వాడేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు ఫొటోను వాడుకుంటూ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సదరు ట్వీట్‌లో ‘ప్రైవేట్ వాహనాలను జాతరకు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారు భయ్యా.. నడిచి నడిచి కాళ్లు లాగేస్తున్నాయి అంటూ మహేష్‌బాబు అంటుంటాడు. హాయిగా ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లొచ్చు కదా భయ్యా.. నేరుగా గద్దెల దగ్గరకే తీసుకెళ్తారు’ అంటూ ఇంకో మహేష్‌బాబు సమాధానం ఇచ్చేలా మీమ్ క్రియేట్ చేసి పోస్ట్ చేయగా నెటిజన్‌లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మీమ్‌కు ‘సర్కారు వారి బస్సు’ అని పేరు పెట్టి.. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల మధ్య తేడాల గురించి వివరించడంపై నెటిజన్‌లు ప్రశంసిస్తున్నారు.
#TSRTCBus లు అమ్మవార్ల గద్దెకు దగ్గరగా వెళ్ళును, Private Vehicles 5km దూరంలో నిలుప బడును #MedaramJathara కు విచ్చేస్తున్న అశేష భక్త జనానికి #TSRTC తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 16, 2022
@TSRTCHQ @baraju_SuperHit @urstrulyMahesh @MBofficialTeam @Medaramjathara @TV9Telugu @way2_news pic.twitter.com/lThN4Lxnh8