Ramesh Nalam
Author- NTV Telugu-
Hyderabad Metro Rail: ఆగిపోయిన రైళ్లు.. ప్రయాణికుల అవస్థలు
హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైళ్లు మొరాయించాయి. సాంకేతిక కారణాల వల్ల గురువారం రాత్రి మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లే మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలోని అసెంబ్లీ స్టేషన్‌లో సుమారు 20 నిమిషాలకు పైగా మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల తరచూ మెట్రో రైళ్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోతున్నాయని.. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా మెట్రో రైలు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో ఇటీవల […] -
YV Subba Reddy: తిరుమలలో ప్రైవేట్ హోటళ్లు పూర్తిగా తొలగింపు
తిరుమలలో త్వరలోనే శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భక్తుల అనుమతి ఎప్పుడనేది ఆధికారులు ఏర్పాట్లు చేశాక ప్రకటిస్తామని తెలిపారు. తిరుమలలో సామాన్యుడి నుంచి వీఐపీల వరకు అందరికీ ఒకే రకమైన అన్నప్రసాదం అందిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుందన్నారు. తిరుమలలో ప్రైవేట్ హోటళ్లు పూర్తిగా తొలగిస్తామన్నారు. హోటళ్లు లేకుండా భక్తులకు ఉచితంగా భోజనం అందించేలా చర్యలు చేపడతామన్నారు. […] -
CM KCR: కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కటింగ్, షేవింగ్ ఉచితం
తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఓ కటింగ్ షాపు ఓనర్ ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై బ్యానరు కట్టి ప్రజలకు కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని.. ఆయన పుట్టినరోజు కాబట్టి గత రెండేళ్లుగా తాను పేదవాళ్లకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కటింగ్, షేవింగ్ […] -
Kodali Nani: చంద్రబాబును సీఎం చేయడం పచ్చ మీడియా వల్ల కాదు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విదేశాలకు ఏపీ దాన్యం ఎగుమతి అవుతోందని.. కిలో రూ.25కే ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని చంద్రబాబు తోక పత్రికలో రాశారని… రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును సీఎం చేసేవరకు ఆయనకు తోకలుగా ఉన్న పార్టీలు, తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదని […] -
Medaram Jatara: మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
తెలంగాణలో మేడారం జాతర కన్నుల పండువగా జరుగుతోంది. జాతర సందర్భంగా మేడారం పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం నాడు ఏరియల్ వ్యూ నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగే ఈ జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కోరారు. ఈ విషయంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అతిపెద్ద గిరిజన జాతర అంటే […] -
Yash Dhul: రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన అండర్-19 క్రికెట్ కెప్టెన్
ఇటీవల యువ భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో కెప్టెన్ యశ్ ధుల్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతడు రంజీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మేరకు ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే యశ్ ధుల్ సెంచరీతో కదం తొక్కడం విశేషం. గౌహతి వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగి యశ్ ధుల్ సెంచరీతో రాణించాడు. మొత్తం 150 బంతులు ఆడి 113 పరుగులు చేశాడు. అతడి […] -
Balineni Srinivas Reddy: విద్యుత్ కోతలను ప్రతిపక్షాలు భూతద్దంలో చూపిస్తున్నాయి
ఏపీలో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు నెలకొన్నాయి. ఎక్కువగా గ్రామాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ రెండు గంటల నుంచి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీలో చిన్న చిన్న విద్యుత్ కోతలు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ వాటిని ప్రతిపక్షాలు భూతద్దంలో చూపుతున్నాయని ఆయన ఆరోపించారు. గత […] -
BCCI: టీమిండియా బౌలర్ భువనేశ్వర్‌కు హెచ్చరిక.. ఇదే చివరి అవకాశం
టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను బీసీసీఐ సెలక్టర్ పరోక్షంగా హెచ్చరించారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భువనేశ్వర్‌కుమార్ రాణించకుంటే పుజారా, రహానే మాదిరి జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హితవు పలికారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత బీసీసీఐ టెస్టు జట్టులోని సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలపై వేటు పడిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ భువనేశ్వర్‌కు కూడా డెత్ సిరీస్ అని భావించొచ్చన్నారు. […] -
Andhra Pradesh: గుడ్ న్యూస్.. రేపటి నుంచి థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వివాదంపై ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు సినిమా టిక్కెట్ల ధరల సమస్యలపై సచివాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు హాజరయ్యారు. అనంతరం స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఏపీలోని థియేటర్లలో శుక్రవారం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. అయితే ప్రేక్షకులు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. అటు టిక్కెట్ రేట్లపై […] -
Vijay Sai Reddy: ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే
ఏపీలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను అకస్మాత్తుగా బదిలీ చేయడంపై టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నలుగురు డీజీపీలను మార్చినా ఒక్కరూ మాట్లాడలేదని.. జగన్ గారి హయాంలో 30 నెలలుగా డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను మారిస్తే ఆయనపై ఏదో ప్రేమ ఉన్నట్లు పచ్చ బ్యాబ్ గగ్గోలు పెడుతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా చేయడంతో పచ్చ మీడియాకు షాక్ తగిలిందని.. […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?