YSRTP: షర్మిలకు శుభవార్త.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఈసీ గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సీఈసీ వెల్లడించింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. తమ పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా తమకు లేఖ అందినట్లు పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ ప్రకటించారు. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని రాజగోపాల్ తెలిపారు.
అటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు కోసం షర్మిల తల్లి విజయలక్ష్మి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించారు. కానీ కొన్ని కారణాల వల్ల పార్టీ పేరు రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. తాజాగా ఈసీ గుర్తించడంతో ఈ నెల 16 నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రాజకీయ గుర్తింపు లభించినట్టు అయింది. ప్రస్తుతానికి మాత్రం ఈ పార్టీకి వాడుక రాజగోపాలే అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో త్వరలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా షర్మిల పేరును ఆమోదించి ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు తెలుస్తోంది.
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
కాగా తండ్రి వైఎస్ఆర్ మాదిరిగానే వైఎస్ షర్మిల కూడా ప్రజా ప్రస్థానం పేరుతో ప్రజ సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టారు. అలాగే నిరుద్యోగ నిరహార దీక్ష, రైతు వేదన దీక్ష కూడా షర్మిల శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ ఇమేజ్ ను తెలంగాణలో తన పార్టీకి రాబట్టుకునేలా షర్మిల అడుగులు వేస్తున్నారు. అందుకే ప్రతి సమావేశంలోనూ ఇప్పుడు రాజన్న ఉండి ఉంటే ఏఏ పథకాలు ఉండేవో ప్రజలకు వివరిస్తున్నారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!