Ukraine Crisis: ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ ప్రకటించిన రష్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ను రష్యా ప్రకటించింది. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ దేశ చర్యల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో కూడా ఊహించని విధంగా చేసి చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఉక్రెయిన్‌లో పలు నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే రష్యా తాజా ప్రకటనతో ప్రపంచ దేశాలు షాక్‌కు గురవుతున్నాయి. అటు అమెరికా కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ బలగాలను దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఎలాగైనా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ను కాపాడాలని అమెరికా భావిస్తోంది. అయితే… రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుంతుని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!