Ukraine Crisis: రష్యా దాడికి ప్రతి చర్య తప్పదు: జో బైడెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగడంపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో జరిగే పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని.. రష్యా సైనిక చర్యను ఆపాలని, బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని ఆయన పేర్కొన్నారు.
రష్యా దాడులకు ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఈ అంశంపై తాము తమ మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో నిర్ణయాత్మకంగా స్పందిస్తామని ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పుతిన్ ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అటు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం తరహాలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కేవలం రెండు గంటల్లోనే రష్యా బలగాలు మకాం వేశాయి. కీవ్ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకున్నాయి. కాగా ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతున్న రష్యాపై బ్రిటన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు మండిపడుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!