Banks Scam: విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు.. కేంద్రం కీలక సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.18 వేల కోట్లు వసూలు చేసిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చింది. 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు తెలిపింది. అన్ని కేసుల్లో కలిపి మొత్తం రూ.67వేల కోట్లను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
మనీల్యాండరింగ్ కేసుల్లో ఈడీకి విశేష అధికారాలను కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ వివరాలను సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఈ కేసులో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన వారికి కోర్టులు కల్పిస్తున్న రక్షణ కారణంగా పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు ఇప్పటికీ నిలిచిపోయిందన్నారు. రికవరీ దశను దాటలేదని గణాంకాలు చెప్తున్నాయని ఆయన కోర్టుకు వివరించారు.
Also Read
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!