గవర్నర్ ప్రసంగం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు కొనసాగుతున్నాయి. ఇటీవల సంభవించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై ఏపీ అసెంబ్లీ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సీఎం జగన్ స్వయంగా సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. గౌతమ్ రెడ్డి మరణంపై ఆయన ప్రసంగిస్తూ.. ఆ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. సంతాప తీర్మానం సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. గౌతమ్ రెడ్డి మరణం చాలా లోటని ఆయన అన్నారు. ఆయన మరణంపై […]
ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి శాంతించింది. ప్రస్తుతం రోజువారీ 5వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాలను కరోనా వమ్ము చేస్తోంది. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2020 మార్చి తర్వాత గత రెండు రోజులుగా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఆదివారం 312 కరోనా కేసులు నమోదుకాగా సోమవారం మరో 214 కరోనా పాజిటివ్ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వనపర్తికి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 11:45 గంటలకు చేరుకుంటారు. అక్కడే అగ్రికల్చర్ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డుమార్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని ‘మనఊరు – మనబడి, మనబస్తీ […]
ఏపీ రాజధాని విషయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏపీకి మూడు రాజధానులు అనే వైసీపీ ప్రభుత్వం చెప్పిందని.. తాజాగా మూడు రాజధానులు పోయి.. నాలుగో రాజధాని హైదరాబాద్ కూడా వచ్చి చేరిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తనకు అన్ని విధాలుగా ఉపయోగపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవడానికి జగన్ ఏపీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. […]
ఏపీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల చెల్లింపుల కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం వాయిదా పడింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల డబ్బులు జమ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ పథకం వాయిదా పడటంతో ఈ రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశాలు లేవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం […]
అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద సీఎం […]
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వేస్టేషన్‌లో సోమవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొందరు ప్రయాణికులపై దాడి చేసి రూ.89 లక్షల సొత్తు ఎత్తుకుపోయారు. దుర్గి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైల్వేస్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారంలో చెన్నై వెళ్లేందుకు ఎస్-6 బోగీ ఆగే ప్రదేశంలో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అదే సమయంలో పక్కనే ఉన్న రైల్వే ఖాళీ స్థలం నుంచి ఆరుగురు వ్యక్తులు రైలు కోసం వేచి చూస్తున్న ముగ్గురు ప్రయాణికుల […]