Bandi Sanjay: టీఆర్ఎస్ ప్లాన్ ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అకారణంగా రేవంత్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. మంత్రి హరీష్‌రావు కేంద్రాన్ని తిడుతుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాక్షస ఆనందం పొందారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో 270 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఆ తరువాత ఎన్నికల్లో తుడుచుకుపోయిందన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కుదరదన్నారు. అసలు బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి అని, సభకు ఎలాంటి ఆటంకం కలిగించకపోయినా, ఏ కారణం లేకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. గవర్నర్‌ను శాసనసభకు ఆహ్వానించకుండా అవమానించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది అన్నారు. అసలు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
హరీష్‌రావు బడ్జెట్ నేతి బీరకాయలో నెయ్యిలాగా ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఇది అబద్దాల బడ్జెట్ అని.. గత బడ్జెట్‌లో కేటాయించింది ఎంత ఖర్చు చేశారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు ఎన్ని రోజులు అడ్డుకున్నారో చెప్పాలని.. అక్కడ టీఆర్ఎస్ ఎంపీలు పోడియం దగ్గర ఆందోళన చేశారని బండి సంజయ్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా లోక్ సభలో ఆందోళన చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కే అసెంబ్లీలో కూర్చునే అధికారం లేదన్నారు. గవర్నర్‌ను కలుస్తున్నాం అని.. రాష్ట్రపతిని కూడా కలుస్తామని.. ఆయన అపాయింట్‌మెంట్ అడుగుతున్నామని బండి సంజయ్ తెలిపారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ప్రజా సమస్యలపై తాము న్యాయపరంగా కొట్లాడతామని.. ప్రజల మధ్య నిరసనలు తెలుపుతామని బండి సంజయ్ వెల్లడించారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని.. తెలంగాణలో నియంత పాలన కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని.. ఈ పోయే ప్రభుత్వానికి అబద్దాలు ఎక్కువ అని బండి సంజయ్ విమర్శలు చేశారు. బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!