Shane Warne: వార్న్ గదిలో రక్తపు మరకలు.. అసలు పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. సెలవులను ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లిన షేన్ వార్న్ అక్కడి హోటల్ గదిలో విగతజీవుడై పడిఉన్న సంగతి అతడి వ్యక్తిగత సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. అయితే వార్న్ మరణంపై థాయ్‌లాండ్ పోలీసులు షాకింగ్ అంశాలను ప్రస్తావించారు. వార్న్ గదిలో రక్తపు మరకలు గుర్తించినట్లు పోలీసులు చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో వార్న్ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుండెపోటుతో కింద పడిన సమయంలో అతడికి ఏమైనా గాయం అయిందా… అందువల్లే గదిలో రక్తపు మరకలు ఏర్పడ్డాయా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అయితే వార్న్‌ది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్టులో థాయ్‌లాండ్ వైద్యులు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి ఉన్న కాంజెషినల్ డిసీజ్ వల్లే వార్న్ మరణించినట్లు పోస్టుమార్టం చెప్తోంది. ఈ రిపోర్టును వార్న్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని సమాచారం. కాగా మంగళవారం నాడు వార్న్ భౌతికకాయాన్ని థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియా తీసుకెళ్తారు. మరోవైపు మరణానికి ముందు 14 రోజులుగా కేవలం ద్రవ రూపంలో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే వార్న్ తీసుకున్నాడని.. ఈ డైట్ వార్న్ కొంపముంచిందని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్‌కిన్ తెలిపాడు.
Also Read
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
- Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!