అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తెలంగాణ ఆర్టీసీ నజరానా ప్రకటించింది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మహిళల కోసం పలు ఆఫర్లను కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుందని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ […]
★ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం★ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం★ ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా నేడు నారీ శక్తి అవార్డుల ప్రదానం.. అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మహిళా సాధికారత కోసం కృషి చేసిన వారికి అవార్డులు★ నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మహిళా దినోత్సవ […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకోనున్నాడు. శ్రీలంకతో ఈనెల 12 నుంచి బెంగళూరు వేదికగా జరిగే రెండో టెస్టు ద్వారా రోహిత్ తన కెరీర్‌లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 44 టెస్టులు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ మొదట్లో వరుసగా విఫలం కావడంతో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తినప్పటి నుంచి తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు. […]
రాత్రిపూట కొంతమంది సరిగ్గా నిద్రపోరు. మొబైల్ లేదా టీవీ చూస్తూ లేటుగా నిద్రపోతుంటారు. మళ్లీ ఉదయాన్నే లేచి తమ పనుల్లో నిమగ్నమవుతారు. అలాంటి వారికి కంటి నిండా నిద్ర ఉండదు. అయితే ఇలాంటి అలవాటు భవిష్యత్‌లో జీవక్రియలపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోనివారు పగలు నిద్రపోవాలని ఆలోచిస్తుంటారు. కానీ పగటి నిద్రకు, రాత్రి నిద్రకు చాలా తేడా ఉంది. ఎందుకంటే రోజంతా కష్టపడి అలసిపోయిన శరీరానికి రాత్రిపూట […]
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8న మంగళవారం నాడు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాజువల్ లీవ్‌ను ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ జీవో జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును పండుగలా జరుపుకోవాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో […]
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రెండు రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ.15, డీజిల్ రూ.22 మేర పెరగనున్నాయని ఐఏఎన్‌ఎస్ రిపోర్ట్ తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాకముందు క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉంటే ఇప్పుడు ఏకంగా 125 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం మన దేశంలో ఉపయోగిస్తున్న చమురులో 80 శాతం దిగుమతుల […]
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చేది లేదని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులు, అమరులను అవమానం చేసేలా ఉందని రేవంత్ ఆరోపించారు. 1200 మంది అమరులు అయితే 500 మందిని మాత్రమే గుర్తించారని.. అమరుల కుటుంబాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులను చివరి బడ్జెట్‌లో కూడా […]
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు టీమిండియా మరింత బలోపేతం అయ్యింది. తొలి టెస్టుకు గాయం కారణంగా దూరంగా ఉన్న అక్షర్ పటేల్.. రెండో టెస్టు కోసం జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తగిన ఫిట్‌నెస్ సాధించిన అక్షర్ పటేల్ ఈ నెల 12 నుంచి శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడంతో కుల్‌దీప్ యాదవ్ టీం నుంచి […]
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. స్టేషన్‌కు ఇటీవల కాలంలో కేసులు ఎక్కువగా వస్తున్నాయని పోలీసులు శాంతి పూజలు నిర్వహించడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులందరూ కలిసి అర్చకుల చేత విశేష పూజలు చేయించడంతో.. ఇలా ఎందుకు చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులను తగ్గించడానికి అంటూ పోలీసులు సమాధానం చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆదివారం […]