ఏపీలోని చిత్తూరు జిల్లాలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులపై జంతుబలి కేసు నమోదైంది. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా కొందరు పవన్ అభిమానులు మేకను బలిచ్చినట్టు చిత్తూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులపై ఆంధ్రప్రదేశ్ జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం-1950లోని సెక్షన్-6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపారు.
పవర్‌స్టార్ అభిమానులపై జంతు బలి కేసు నమోదైందని.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అషర్ అనే న్యాయవాది సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మేకను బలిస్తున్న ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. కాగా భీమ్లా నాయక్ సినిమా రెండో వారం ప్రదర్శింపబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా షేర్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అయితే ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో ఇంకా ఈ మూవీ బయ్యర్లు బ్రేక్ ఈవెన్‌కు రాలేదని సమాచారం.