ఈ ఏడాది ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు అడుగుపెట్టబోతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ అందులో ఒకటి. పేపర్ మీద ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మరి ప్రధాన టోర్నీలో ఎలా రాణిస్తుందో అన్న విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. రూ.7,090 కోట్లతో సంజీవ్ గోయెంకా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. రూ.17 కోట్లు ఖర్చు చేసి కేఎల్ రాహుల్‌ను మెగా వేలం కంటే ముందే తీసుకున్నారు. అంతేకాకుండా కెప్టెన్‌గానూ నియమించారు. మరోవైపు గతంలో కోల్‌కతాకు రెండుసార్లు […]
19 ఏళ్ల వయసులో సాధారణంగా ఎవరైనా కాలేజీ చదువుతో లేదంటే ఖాళీ దొరికితే స్నేహితులతో కలసి షికార్లు కొడుతుంటారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు ప్రదీప్ మెహ్రా అలా కాదు. చిన్న వయసుకే బాధ్యతలు తెలిసినవాడు. ఉత్తరాఖండ్‌లోని పల్మోరాకు చెందిన ఈ బాలుడు నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తుంటాడు. పొద్దున వెళితే.. అర్ధరాత్రి వరకు డ్యూటీ. దీంతో రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి […]
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 133మంది మరణించారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. కన్ మింగ్ నుంచి వెళ్తుండగా గ్వాంగ్జీ ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలో విమానం క్రాష్ ల్యాండ్ అయి ప్రమాదం జరిగింది. పర్వతాలలో మంటలు చెలరేగాయని సీసీటీవీ ఫుటేజ్ తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్‌లను ఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా క్రేజ్ సంపాదించుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పుష్ప సినిమాలోని డైలాగులు, పాటలకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ కోసం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హెటల్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంట నూనెలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో భారత్‌లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పలు చోట్ల వ్యాపారులు దొరికిందే సందు అని నూనె ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వంట నూనెలను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. పాత స్టాక్ విషయంలో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని […]
ఉక్రెయిన్‌పై రష్యా భీకర స్థాయిలో దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. అటు రష్యా కూడా ఎప్పుడు ఏం జరుగుతోంది తెలియక సతమతం అవుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వస్తువు ఏమైనా ఉందంటే.. అది కండోమ్ అని ఆ దేశపు ప్రముఖ ఆన్‌లైన్ రీటెయిలర్ వైల్డ్‌బెర్రీస్ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని […]
ప్రస్తుతం క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెటర్లు పెళ్లిళ్లు చేసుకుని ఈ మెగా లీగ్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ తన భారత ప్రేయసిని పెళ్లి చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథీ కూడా అతడి బాటలోనే నడిచాడు. 33 ఏళ్ల వయసులో తాను చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రయాను సౌథీ పెళ్లి చేసుకున్నాడు. ఈ మేరకు తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు […]
ఏపీలో ప్రస్తుతం కల్తీ మద్యం, కల్తీ సారాపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. పచ్చపార్టీ వాళ్లు లిక్కర్ బ్రాండ్లపై ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, గవర్నర్స్ రిజర్వ్ విస్కీ వంటి మద్యం బ్రాండ్‌లకు 2018 ఫిబ్రవరి 6న అప్పటి సీఎం చంద్రబాబే అనుమతులు ఇచ్చారని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. భూమ్.. భూమ్ బీర్ కంపెనీకి 2019 […]
దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లినా బాలికను ఎత్తుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. భుజ్ శివారులో జరిగిన ఈ ఘటన మార్చి 16న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని సమీపంలోని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను హుస్సేన్ కాకల్ […]
ఐపీఎల్‌లో సురేష్ రైనాకు అద్భుతమైన రికార్డు ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అతడు గుర్తుండిపోయేలా ప్రదర్శనలు చేశాడు. అయినా ఈ ఏడాది అతడు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘స్పోర్ట్స్ ఐకాన్’ అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కోసం 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీపడగా చివరకు సురేష్ రైనాను వరించింది. ఈ అవార్డు కోసం […]