Andhra Pradesh: వంట నూనె వ్యాపారులకు ప్రభుత్వం హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంట నూనెలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో భారత్‌లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పలు చోట్ల వ్యాపారులు దొరికిందే సందు అని నూనె ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వంట నూనెలను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. పాత స్టాక్ విషయంలో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించారు.
మరోవైపు వంటనూనె విక్రయాల విషయంలో అక్రమాలకు పాల్పడినవారిపై బైండోవర్ కేసులు పెడతామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. బ్లాక్ మార్కెటింగ్‌పై దాడులు కొనసాగుతాయని చెప్పారు. అక్రమాలపై ప్రజలు 9440906254 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని సూచించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంటనూనె ధరలు పెరిగాయని.. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు , దుకాణాలపై దాడులు చేశామని ఆయన వివరించారు. 1890 ప్రదేశాల్లో తనిఖీలు చేసి 59 కేసులు నమోదు చేశామన్నారు. 889 కేసులను లీగల్ మెట్రాలజీ అధికారులు నమోదు చేశారని పేర్కొన్నారు.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!