ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రసంగం చాలా భావోద్వేగంగా సాగింది. ముందుగా కర్ణాటకలో ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసినందుకు నిర్మాత వెంకట్‌కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా ఈరోజు పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేకపోయినా ఈ చల్లని సాయంత్రం ఆయన ఓ వర్షపు చినుకుల రూపంలో, చల్లని గాలి రూపంలో ఆయన మన పక్కనే ఉన్నారని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. పునీత్ రాజ్‌కుమార్ లేరని తానెప్పుడూ ఏడవలేదని.. ఏడవను కూడా అని […]
కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర వేదికగా ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ… ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కన్నడలో రిలీజ్ చేస్తున్న నిర్మాత వెంకట్ బాగా ఎరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం వంటిదని రాజమౌళి అభివర్ణించాడు. అంతేకాకుండా మెగా అభిమానులను బంగాళాఖాతంతో, నందమూరి అభిమానులను అరేబియా మహాసముద్రంతో పోల్చి కొనియాడాడు. మరోవైపు తనకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్‌లే […]
ఈనెల 28, 29 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల విషయంలో అసంతృప్తిగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మె చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AICBEF), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే అంతకన్నా ముందు మార్చి 26న నాలుగో శనివారం, మార్చి 27న ఆదివారం కారణంగా బ్యాంకులు తెరుచుకోవు. […]
వేసవి సందర్భంగా విహార యాత్రలకు వెళ్లే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందింది. రద్దీ దృష్ట్యా 104 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-ఎర్నాకుళం, మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీలలో సికింద్రాబాద్-ఎర్నాకుళం మధ్య (రైలు నంబర్ 07189) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ రైళ్లు […]
ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధా ఇద్దరూ క్రేజ్ ఉన్న నేతలే. వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా వీరిద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. సాధారణంగా వైసీపీ, టీడీపీ నేతలు అనేక అంశాలపై ఆరోపణలు చేసుకోవడం మాములే. కొడాలి నాని నిత్యం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటారు కూడా. ప్రతిగా టీడీపీ నేతలు కూడా కొడాలి నానిని టార్గెట్ చేస్తుంటారు. కానీ కొడాలి నాని, రాధా అనుబంధంపై ఈ మాటల […]
పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విప్లవవీరుడు భగత్‌సింగ్ ను ఎంతో ఆరాధిస్తాడు. ఎంతలా అంటే తన ప్రమాణస్వీకారానికి భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామాన్ని ఎంచుకున్నారు. బసంతి తలపాగా ధరించి అచ్చు భగత్‌సింగ్‌లా దర్శనమిచ్చారు. ఐతే, సీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఫొటోపై ఇప్పుడు వివాదం రేగింది. ఆ ఫొటోలో ఆయన బసంతి తలపాగా (పసుపు రంగు తలపాగ) ధరించి ఉంటమే వివాదానికి కారణం. ఆ ఫొటో ప్రామాణికతపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రకారుల ప్రకారం ఇది […]
శ్రీలంక దేశాన్ని ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేస్తోంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఆ దేశంలో పరిస్థితి ఎంతలా దిగజారిందో తెలియజేస్తోంది. నిధుల కొరత కారణంగా దిగుమతులు చేసుకోలేని దుస్థితి తలెత్తడంతో ఆ దేశంలో పేపర్ నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో సోమవారం నుంచి జరగాల్సిన టర్మ్ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ప్రశ్నపత్రం తయారీకి సరిపడా పేపర్, ఇంక్ లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని అధికారులు ప్రకటించారు. శ్రీలంక అధికారుల నిర్ణయంతో దేశంలోని మొత్తం 45 లక్షల విద్యార్థుల్లో […]
కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూజివీడు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతలు గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా నూజివీడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నూజివీడు గాంధీ బొమ్మ […]
కడపలో బీజేపీ రాయలసీమ రణభేరి సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిపోయిందని.. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎన్నాళ్లు నెట్టుకొస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు […]
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని సవాల్ చేయడంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. ఆయనకు అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను […]