కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీరం ఇనిస్టిట్యూట్ ఇఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలుగా ఉంది. అయితే ఈ వ్యవధిని 8 నుంచి 16 వారాలకు […]
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కారణంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో భారత్‌లో టోకు విక్రయదారులకు అమ్మే డీజిల్ ధరను లీటరుకు రూ.25 పెంచారు. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 40 శాతం పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర […]
కర్నూలులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ భేటీలో పలువురు బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పేందుకు వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఏపీపై ప్రత్యేక ప్రేమతో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను కేంద్రం ఏపీకి ఇస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ […]
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పాల్గొన్నారు. ఇందులో భాగంగా జర్నలిస్ట్ స్వప్నతో కలిసి ఆయన మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో తాము మొక్కలు నాటినట్లు ఆర్జీవీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. దీంతో ఆయన పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తనకు పచ్చదనం అంటే నచ్చదని, బురద అంటే అస్సలు గిట్టదని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. […]
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ నుంచి వస్తున్న మూవీ ఇదే. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇప్పుడు తాజాగా రెండో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పెన్నీ అంటూ సాగే లిరికల్ పాట విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ […]
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వలిమై’. ఫిబ్రవరి 24న విడుదలైన ఈ మూవీ తమిళనాడులో భారీ కలెక్షన్‌లను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈనెల 25 నుంచి వలిమై స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జీ5 సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. వలిమై సినిమాలో టాలీవుడ్ […]
ఏపీలో ఇటీవల ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతలు వియ్యంకులుగా మారుతున్నారు. ఇటీవల వైసీపీ నేతలు కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్ వియ్యంకులు అయ్యారు. తాజాగా టీడీపీ నేతలు బోండా ఉమా, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాలు కలవబోతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతితో బోండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం జరగనుంది. త్వరలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరువురు నేతలు తమ పిల్లలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు. జస్వంతి, సిద్ధార్థ్ ఇద్దరూ […]
ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఎందుకంటే మొయిన్ అలీకి వీసా సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో అతడు ఇండియా రావడానికి ఇప్పటిదాకా వీసా లభించలేదని తెలుస్తోంది. మొయిన్ అలీ ప్రస్తుతం ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ […]
కృష్ణా జిల్లా వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలోని వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో గన్నవరం వైసీపీ క్యాడర్ వైసీపీ కీలక నేత, పార్టీ వ్యవహారాల శాఖ ఇంఛార్జి విజయసాయిరెడ్డికి లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు వల్లభనేని వంశీకి అప్పగించొద్దని వైసీపీ కార్యకర్తలు లేఖలో విజయసాయిరెడ్డిని కోరారు. తాము 9 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు […]
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్‌లు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో ఉంది. తాజాగా వయోపరిమితి సడలింపుపై తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయసును 44 ఏళ్లకు […]