Viral Video: రోజూ రాత్రి 10 కి.మీ. పరుగెడుతున్న యువకుడు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
19 ఏళ్ల వయసులో సాధారణంగా ఎవరైనా కాలేజీ చదువుతో లేదంటే ఖాళీ దొరికితే స్నేహితులతో కలసి షికార్లు కొడుతుంటారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు ప్రదీప్ మెహ్రా అలా కాదు. చిన్న వయసుకే బాధ్యతలు తెలిసినవాడు. ఉత్తరాఖండ్‌లోని పల్మోరాకు చెందిన ఈ బాలుడు నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తుంటాడు. పొద్దున వెళితే.. అర్ధరాత్రి వరకు డ్యూటీ. దీంతో రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి వరకు పరిగెడుతూ వెళ్లడం అతడి దినచర్యలో భాగం. అతడితో పాటు అతడి సోదరుడు, అమ్మ కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఓ రోజు రాత్రి ఆ బాలుడు ఓ నిర్మాత దృష్టిలో పడ్డాడు. ‘ఎందుకు రాత్రి వేళ అలా పరుగెత్తుతున్నావు, నా కారులో రా దిగబెడతాను’ అంటూ ఫిలిం మేకర్ వినోద్ కాప్రి ఆఫర్ చేశాడు. అయినా ఆ బాలుడు కారు ఎక్కేందుకు నిరాకరించాడు. ఉదయం రన్నింగ్ చేయొచ్చుగా? అని ప్రశ్నించాడు. దాంతో అప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుందని, సమయం చాలదని ప్రదీప్ మెహ్రా బదులిచ్చాడు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
ఆర్మీలో చేరడమే తన ధ్యేయమని ప్రదీప్ స్పష్టం చేశాడు. అందుకోసమే నిత్యం సాధనలో భాగంగా రన్నింగ్ చేస్తున్నానని.. కారులో వస్తే తన సాధన గాడి తప్పుతుందన్నాడు. ప్రతి రోజు పొద్దున 8 గంటలకు లేవాలి. పనికి వెళ్లడానికి ముందు ఆహారం సిద్ధం చేసుకోవాలి. రాత్రి వచ్చిన తర్వాత కూడా ఆహారాన్ని వండుకుని తినడమే కాదు.. రాత్రి షిప్ట్ ఉద్యోగానికి వెళ్లిన సోదరుడి కోసం కూడా ఆహారాన్ని ప్రదీప్ సిద్ధం చేయాలి. ఇది అతడి దినచర్య. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రదీప్ ఇన్‌స్పైరింగ్ స్టోరీ పలువురిని కదిలిస్తోంది.
మరోవైపు ప్రదీప్ మెహ్రాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రదీప్ చిత్తశుద్ధిని కేటీఆర్ కొనియాడారు. అతడు అద్భుతం అని కేటీఆర్ ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ప్రదీప్ మెహ్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రదీప్ కల సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!