ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా క్రేజ్ సంపాదించుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పుష్ప సినిమాలోని డైలాగులు, పాటలకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ కోసం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హెటల్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా విచ్చేశారు.
ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి దంపతుల సమక్షంలో అల్లు అర్జున్‌ను స్నేహారెడ్డి తండ్రి ఘనంగా సత్కరించి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు పార్టీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ పార్టీకి అల్లు స్నేహారెడ్డి, అల్లు అరవింద్ దంపతులు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి, గుణశేఖర్, సుబ్బిరామిరెడ్డి హాజరైనట్లు తెలుస్తోంది.