గోదావరి నీళ్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాలు కడగాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రికి అధికారులు నీరు విడుదల చేశారు. ఈ మేరకు ఆఫ్టేక్-2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. అటు నుంచి ఈ గోదావరి జలాలు యాదాద్రి నారసింహుడి చెంతకు చేరాయి. యాదాద్రి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమైన రోజే గండి చెరువును అధికారులు కాళేశ్వరం నీటితో నింపారు. […]
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రానికి ఏడు నూతన ఈఎస్‌ఐ ఆస్పత్రులను మంజూరు చేసింది. సోమవారం నాడు పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విశాఖలో రూ.384.26 కోట్లతో సీపీడబ్ల్యూడీ శాఖతో నూతన ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని.. విజయనగరంలో రూ.73.68 కోట్ల కేంద్ర నిధులతో MECON కంపెనీ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని.. […]
ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పాలనను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు జిల్లాల పునర్విభజనపై వివిధ ప్రాంతాల్లో పలు డిమాండ్లు, అభ్యర్థనలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని పక్కకు పెట్టి పాలన అందించడంపైనే దృష్టి పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సుమారు 11వేల అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాలకు జిల్లా కేంద్రాలు మార్చాలని.. మరికొన్ని జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలని డిమాండ్లలో ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చిన 11వేల డిమాండ్లలో […]
దేశవ్యాప్తంగా సుదీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో సుమారు ఐదు నెలల తర్వాత ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలు పెరగడం ప్రారంభించాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర […]
★ నేడు ప్రపంచ నీటి దినోత్సవం★ నేడు కడప చేరనున్న కువైట్‌లో మృతిచెందిన వెంకటేష్ మృతదేహం.. కువైట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన కడప జిల్లా వాసి వెంకటేష్★ తిరుమల: నేడు మే నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ, బుధవారం నాడు జూన్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల★ నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. జగ్గారెడ్డి వ్యవహారంపై అధిష్టానంతో చర్చించనున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి★ నేడు […]
ఏపీలో ఓ వైపు ఎండల వల్ల ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అయితే మరోవైపు భారీ వర్షాల వల్ల ఇబ్బందులు కూడా పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో సోమవారం నాడు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం, విజయనగరం జిల్లాలోని […]
ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న స్పెషలిస్టు డాక్టర్లకు 30 శాతం నుంచి 50 శాతం వరకు జీతాలు పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేసే స్పెషలిస్టు డాక్టర్లకు 50 శాతం, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (జనరల్), డీఏఎస్ లకు 30 శాతం మేర జీతాలు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. […]
క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా టోర్నీ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 14 సీజన్‌లు పూర్తయ్యాయి. 14 సీజన్‌లలో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల వివరాలు మీకు తెలుసా. అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఓ ఆటగాడు 25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అతడు ఎవరో కాదు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్. […]
దేశంలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి. అయితే ఇంకా చాలా మంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారు మార్చి 31 లోపు ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా కారణంగా ఆధార్, పాన్ లింక్ గడువు […]
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం నాడు పద్మ పురస్కారాల ప్రదానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పద్మ అవార్డుల విజేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచన కర్త, ఏపీకి చెందిన గరికపాటి నరసింహారావు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న వారి జాబితాలో మొగులయ్య కూడా ఉన్నారు. మరోవైపు భారత […]