ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో జోరుగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరిగేర వద్ద పేకాట స్థావరంపై కర్ణాటక పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన 19 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో పలువురు వైసీపీ నేతలతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ కూడా ఉన్నాడు. అతడు వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుతోంది. కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్న […]
ఉక్రెయిన్‌లో రష్యా దాడి మొదలై 25 రోజులు దాటింది. సైనిక చర్య అనేది ఇప్పుడు అది పూర్తి స్థాయి యుద్ధాన్ని తలపిస్తోంది. చర్చలు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించటం లేదు. మరోవైపు రష్యా బలగాలు ఉక్రెయిన్ నగరాలలో విధ్వంసం సృష్టిస్తోంది. దేశంలో రెండో ప్రధాన నగరం మారియుపోల్ సర్వనాశనం అయింది. ఎక్కడ చూసినా యుద్ధం తాలూకు ధ్వంసమే. ప్రస్తుతం ఈ నగరం రష్యా దళాల స్వాధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు పుతిన్ బలగాలు రాజధాని కీవ్‌కు […]
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే తీవ్ర ప్రయాసల నడుమ భారత్ చేరుకున్న విద్యార్థుల ఆనందం అంతా ఇంతా కాదు. వారిలో ఏపీకి చెందిన వందల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఏపీ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి పొరుగుదేశాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులందరూ క్షేమంగా […]
సంతకం పెట్టడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే అందరూ సాధారణంగా వారి పూర్తి పేరును సంతకంగా పెట్టలేరు. అందుకే సంతకం చేసే సమయంలో తమ పేరును కుదిస్తారు. అయితే సంతకం అనేది సులువుగా ఉంటే సులువుగా కాపీ చేసే ప్రమాదం ఉంది. దీంతో సంతకం అర్థం కాకుండా పెట్టడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో కర్ణాటకలో పనిచేసే సబ్‌రిజిస్టర్ శాంతయ్య ప్రత్యేకంగా నిలిచారు. దీంతో ఆయన సంతకాన్ని ఏకంగా యునెస్కో అద్భుతమైన […]
ఉక్రెయిన్ యుద్ధం రోజులకు రోజులుగా సాగుతుండటం రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతోందా? ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటా? రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భావవనలో ప్రస్తుతం పుతిన్ ఉన్నారు. సంవత్సరాలుగా ఆయన మనసెరిగిన పశ్చిమ దేశాల గూఢచార వర్గాలు ఈ అంచనాకు వచ్చారు. పుతిన్ ఇకముందు ఎలాంటి చర్యలకు దిగుతాడో ఆర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్దం సాగుతున్న తీరు పుతిన్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఆయన ఆరోగ్యంపైనా అనుమనాలు […]
మణిపూర్ సీఎంగా బీరెన్‌సింగ్ సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ గణేశన్ ప్రమాణం చేయించారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంఫాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ హాజరయ్యారు. హెయ్‌గాంగ్ నియోజకవర్గం నుంచి బీరెన్ సింగ్ 17వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీరెన్‌సింగ్ వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా రెండోసారి మణిపూర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రమాణస్వీకారం చేసిన […]
ఏపీ రాజకీయాల్లో పెగాసస్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో టీడీపీని ఉద్దేశిస్తూ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిఘా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అధికారులు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. చివరికి సినిమా యాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని విమర్శించారు. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. మమతాబెనర్జీ.. […]
పెగాసస్ వివాదంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అస్త్రంగా వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు అసెంబ్లీలో పెగాసస్ వివాదంపై చర్చ కూడా చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ప్రచారం […]
పెగాసస్ విషయంలో టీడీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్‌పై హౌస్ కమిటీ వేసినా.. జ్యుడిషయరీ కమిటీ వేసినా.. సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే వైఎస్ వివేకా హత్య విషయంలో, ప.గో. జిల్లాలో కల్తీ మద్యం మరణాల విషయంలో వైసీపీ ప్రభుత్వం విచారణకు కమిటీ వేయగలదా అని ప్రశ్నించారు. పెగాసస్‌పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనే […]
అందరూ ఊహించినట్లే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా హర్భజన్ సింగ్‌ను ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్‌లో నామినేషన్ దాఖలు చేశాడు. ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాడు. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ కాసేపు మీడియాతో మాట్లాడాడు. క్రీడల్లో […]