మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళలు సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీతో రాణించిన యాసిక్త భాటియా(50)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. స్మృతి మంధాన (30), షెఫాలీ వర్మ (42) […]
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని తల్లి డింపుల్ దారుణంగా ప్రవర్తించింది. ఈ బిడ్డను హత్య చేసేందుకు వంట గదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టింది. ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో డింపుల్ వంట గది డోర్ లాక్ చేసింది. అంతలోనే ముసలావిడ […]
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. ఓ దొంగ మొబైల్ టాయ్‌లెట్‌ను చోరీ చేసిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 16న సఫిల్‌గూడ చౌరస్తాలోని మొబైల్ టాయ్‌లెట్ కనిపించకపోవడంతో పారిశుధ్య కార్మికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేశారు. మొబైల్ టాయ్‌లెట్‌ను తీసుకెళ్లిన నిందితుడు దోమల్‌గూడలో నివసించే మెదక్ జిల్లా అందోల్ మండలం […]
దేశంలో బాలికల చట్టబద్ద పెళ్లి వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం 20 ఏళ్లకే అమ్మాయిలు పెళ్లి చేసేసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 20ఏళ్ల వయసు లోపు పెళ్లైన యువతుల సంఖ్య 4.18 లక్షలుగా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం కొంత మంది తల్లిదండ్రులు ఆధార్ కార్డుల్లో తమ పిల్లల వయసు పెంచి చూపిస్తున్నారు. కళ్యాణ లక్ష్మీ […]
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఛలానాల క్లియరెన్స్ కొనసాగుతోంది. పెండింగ్ ఛలాన్‌ల కోసం తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన రాయితీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. సుమారు 1.2 కోట్ల పెండింగ్ ఛలానాల ద్వారా రూ.112.98 కోట్లు జమ అయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 63 లక్షల ఛలాన్‌లు క్లియర్ కాగా.. వీటి ద్వారా రూ.49.6 కోట్లు వాహనదారులు చెల్లించారు. […]
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని టెక్ హబ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన షెన్‌జెన్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒకవేళ షెన్‌జెన్‌లో లాక్‌డౌన్ విధిస్తే.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను సరఫరా చేసే నగరాల్లో షెన్‌జెన్ ఒకటి. అక్కడి నుంచే 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. ఎప్పటి నుంచో మెగా, నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు RRR సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలను ఆవిష్కరించాడు. దీని కోసం అతడు ఏకంగా 15వేల టీ కప్పులను ఉపయోగించాడు. చిత్తూరు జిల్లా […]
చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే ఆరోగ్య సిబ్బందితో పాటు 60 ఏళ్లు నిండిన వారికి ప్రికాషనరీ డోస్ పేరుతో మూడో డోస్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో పలు ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని బూస్టర్ డోసుల పరిధిని పెంచాలని ఆరోగ్యశాఖ […]
మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి డోలాయమాన స్థితిలో ఉంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మంగళవారం నాటి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేకాకుండా ఈనెల 27న జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించాలి. అప్పుడే భారత్ ప్రపంచకప్‌లో సెమీస్ చేరేందుకు అవకాశం ఉంటుంది. టీమిండియా సమస్య ఏంటంటే.. బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ బౌలర్లు మాత్రం పూర్తి స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి విజయాల బాట పట్టాలంటే బౌలర్లు తమ బంతులకు […]