రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి చేయడానికే తమ ప్రభుత్వం ఉందని ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. ఏపీ హైకోర్టు చెప్పినట్లు నెలరోజుల్లో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని జగన్ వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నామని తెలిపారు. వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేయమని, ఆటంకాలు ఎదురైనా ముందుకెళ్తామని జగన్ తేల్చి చెప్పారు. చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ లేదని.. ఒకవేళ […]
తెలంగాణలో 2022-2023 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. జూన్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 30న పాలీసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. పాలీసెట్ ద్వారా పదో తరగతి పూర్తి చేసుకున్న […]
పాలకులు ఏదైనా మంచి పని చేస్తే అది కొన్నేళ్ల పాటు ప్రజలకు గుర్తుండిపోవాలి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన యాదాద్రి ఆలయ పునరుద్ధరణ అలాంటిదే. గుట్టపై నూతనంగా వెలసిన ఆలయ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ మహాకార్యాన్ని నిజం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కూడా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు యాదాద్రి అందాలను చూస్తే మైమరచిపోకుండా ఉండలేరు. అంత రమ్యంగా తీర్చిదిద్దారు యాదగిరి నరసింహుని సన్నిధిని. ఎక్కడా రాజీ […]
ఏపీ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. రాజధాని అమరావతిపై తనకు ప్రేమ ఉందని.. ప్రేమ ఉంది కాబట్టే అమరావతిలో తాను ఇల్లు కట్టుకున్నానని.. న్యాయరాజధానిగా అమరావతి కొనసాగాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలు దేనికవే ప్రత్యేకమైనవని జగన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందన్నారు. నెల రోజుల్లో రూ.లక్ష కోట్లతో రాజధాని కట్టేయాలని కోర్టులెలా […]
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ మేరకు ఈనెల 25న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. యోగి ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా విచ్చేయనున్నారు రాజకీయ […]
ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా మంత్రులు కోర్టులపై వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ తప్పుబట్టారు. కేవలం మూడు రాజధానుల విషయంలో మాత్రమే శాసనసభలకు అధికారం లేదని కోర్టు చెప్పిందని లోకేష్ గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనేది పార్లమెంట్ చట్టం ద్వారా జరిగిందని.. పార్లమెంట్ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానులు కావాలనుకుంటే.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 175 జిల్లాలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీ […]
ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టకుండా కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేయాలని భావించారని ఆరోపించారు. ఆయన కట్టాలనుకున్నది రాజధాని కాదని.. నగరం మాత్రమే అని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో నాలుగైదు వందల ఏళ్ల నుంచి నగరాలను అభివృద్ధి చేస్తే.. చంద్రబాబు […]
ఐపీఎల్ సంబరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో ఐపీఎల్ జరగనుంది. దీంతో ఈ ఏడాది ట్రోఫీ ఎవరు గెలుస్తారు అన్న చర్చ మొదలైంది. టైటిల్ ఫేవరేట్స్‌గా చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో కొత్తగా దిగుతున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ […]
మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ అధికారికంగా తప్పుకున్నాడు. ఈ మేరకు తన సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగిస్తున్నట్లు అతడు ప్రకటించాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ధోనీ 204 మ్యాచుల్లో చెన్నైకు సారథ్యం వహించగా ఆ జట్టు 121 విజయాలు సాధించింది. నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. అంతేకాకుండా 9 సార్లు ఫైనల్ […]
ఏపీ అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చర్చ ప్రారంభించారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించానని చెప్పారు. దీనిపై […]