ప్రస్తుతం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’పైనే సినీ అభిమానుల్లో చర్చ సాగుతోంది. దాదాపు 36 ఏళ్ళ తరువాత వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే కావడంతో ఆ చర్చ మరింతగా మురిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్స్ లో ఓ సీనియర్ స్టార్ తో తరువాతి తరం స్టార్ హీరో నటించారు తప్ప, సమకాలికులు, సమ ఉజ్జీలయిన స్టార్స్ కలసి నటించలేదు. అది రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’తోనే సాధ్యమైంది. ఇందులో నవతరం అగ్రకథానాయకులైన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ […]
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 15 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలిసారిగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగబోతోంది. అయితే కోల్‌కతా జట్టు ముగ్గురు విదేశీయులనే జట్టులోకి తీసుకోవడం గమనార్హం. శ్యామ్ బిల్లింగ్స్, రస్సెల్, నరైన్‌లను మాత్రమే తుది జట్టులో స్థానం కల్పించింది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ కాన్వే, […]
తిరుమలలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉచిత బస్సులో (శ్రీవారి ధర్మరథం) మంటలు చెలరేగాయి. శ్రీవారి సేవకులను బస్సులో తిరుపతి నుంచి తిరుమలకు తీసుకెళ్తున్న సమయంలో రెండో ఘాట్‌రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. అయితే మంటలను సకాలంలో గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును లింక్ రోడ్డు వద్ద నిలిపివేశాడు. అనంతరం ఆ తర్వాత బస్సులోని శ్రీవారి సేవకులు వాహనం నుంచి […]
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్ స్కూళ్లకు అదనంగా మరో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో నడిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్లలో 7 డే స్కూళ్లుగా పనిచేయనుండగా.. 14 మాత్రం రెసిడెన్షియల్ మోడ్‌లో నడవనున్నట్లు రక్షణ శాఖ ప్రకటన చేసింది. ఇక కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కోటి చొప్పున […]
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 14 సీజన్‌లు పూర్తయ్యాయి. అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు టైటిల్ విజేతలుగా నిలిచినా బెంగళూరు జట్టుకు మాత్రం ఇంకా ఆ భాగ్యం దక్కలేదు. దీంతో ఈ సారైనా తమ జట్టు టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్న ఆర్‌సీబీ అభిమానులకు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన మాటలతో […]
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (OTS) కింద ఖజానాకు బాగానే డబ్బులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో కలిపి రూ.339 కోట్లు వసూలు అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. 9.86 లక్షల మంది లబ్ధిదారులు రూ.10,000 చొప్పున చెల్లించి తమ ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అత్యధికంగా వినియోగించుకున్న లబ్ధిదారుల జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉండటం […]
కోలీవుడ్‌లో స్టార్ హీరోలు అజిత్, విజయ్ హీరోల మధ్య ఇటీవల నిత్యం ట్విట్టర్ వార్ జరుగుతోంది. దీంతో ఒకరి హీరోపై మరొక హీరో అభిమానులు దుమ్మెత్తిపోసుకోవడం కనిపిస్తోంది. తాజాగా అజిత్, విజయ్ అభిమానుల మధ్య వార్ శ్రుతిమించినట్లు కనిపిస్తోంది. విజయ్ చనిపోయాడని.. ‘బీస్ట్’ అతడి ఆఖరి సినిమా అంటూ అజిత్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. RIPJosephVijay అనే హ్యాష్ ట్యాగ్ కూడా పోస్ట్ చేస్తున్నారు. హీరో విజయ్ ఫొటోలను తమకు ఇష్టం వచ్చినట్లు మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో […]
దేశవ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్ ధరలు, వంటనూనె ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి చాలవు అన్నట్లు మనిషి అనారోగ్యం బారిన పడితే కొనుగోలు చేసే ఔషధాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజూవారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు పెరగనున్నట్లు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. పలు మెడిసిన్స్ ధరలు 10.7 శాతం పెరగనున్నట్లు తెలిపింది. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో […]
ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్‌లు కాకుండా అదనంగా మరో ఐదు రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్‌ల సంఖ్య 15కి చేరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికుల నుంచి ఇప్పటి వరకూ 9 వేలకు […]