భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన ఆయుధంగా పరిగణించే బ్రహ్మోజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బుధవారం భారత ఆర్మీ అధికారులు ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో విజయవంతంగా పరీక్షించారు. రష్యా సహకారంతో డీఆర్‌డీవో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణితో భూతలం నుంచి భూతలానికి, భూమి నుంచి యుద్ధ విమానాలు, యుద్ద నౌకల వంటి టార్గెట్లను ధ్వంసం చేయవచ్చు. తాజాగా బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్ పెరగ్గా.. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా […]
కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహం పేరుతో భార్యలపై భర్తలు లైంగిక దాడులకు పాల్పడటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకకు చెందిన ఒక మహిళ తన భర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె ముందే భర్త లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భర్త కూడా మనిషేనని.. మనిషి లైంగిక దాడి ఎక్కడ చేసినా అది […]
వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చేసిన ప్రకటనపై జొమాటో క్లారిటీ ఇచ్చింది. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే కాన్సెప్ట్‌పై పలు వర్గాల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తమ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందో జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ వివరణ ఇచ్చారు. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సర్వీస్ అందరికీ కాదని, కొన్ని సమీప ప్రాంతాలకు మాత్రమేనని స్పష్టం చేశారు. అది కూడా పాపులర్ ఐటమ్స్‌కి మాత్రమే […]
జగన్ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఇవాళ కూడా సభలో మద్యం పాలసీపై అసత్యాలు చెప్పి జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాలను కించపరిచారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సభలో సీఎంకు వైసీపీ ఎమ్మెల్యేలు చేసే భజన చూడలేకే తమ సభ్యులు చిడతలు వాయించారని తెలిపారు. పాలసీని మార్చి దుకాణాలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా 10 దుకాణాల్లో మద్యం శాంపిల్స్ తీసి న్యాయ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని […]
ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించిన జడేజా ఆల్‌రౌండర్ల కేటగిరీలో 385 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోయాడు. అశ్విన్ (భారత్) మూడో స్థానంలో, షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) నాలుగో స్థానంలో, బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ 916 […]
ఏపీ సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. టీడీపీని చూస్తేనే జగన్ భయపడుతున్నారని.. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి మద్యం పాలసీపై జగన్ ప్రకటన చేశారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ సభ్యులు ఉండే వాస్తవాలు బయటకు వస్తాయని సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా మద్య నిషేధంపై ఊరూరా తిరిగి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక రూ.6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని […]
సికింద్రాబాద్‌లోని బోయగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు సజీవదహనం అయ్యారు. ఈ విషయం తెలుసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ ప్రెస్ నోట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ తెలుగులోనే ప్రెస్‌నోట్‌లను విడుదల చేస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రెస్ […]
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లకు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు […]
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై నెలరోజులు కావస్తోంది. ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై కనిపించటం ప్రారంభమైంది. ముడి చమురు, ఇందన ధరలతో పాటు నిత్యావసరాలైన వంట నూనెలు, ప్యాక్డ్ ఐటెమ్స్, కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మున్ముందు ఈ ధరల భారంతో సామాన్యుడు మరింతగా కుదేలయ్యే ప్రమాదం ఏర్పడింది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే సామాన్యుడి జీవన శైలి ఘోరంగా దెబ్బతింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. […]
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే లాలూ ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం ఉదయం ఆయన్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం మళ్లీ లాలూ ఆరోగ్యం విషమించడంతో మరోసారి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి ఆయన్ను తరలించినట్లు లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ మీడియాకు వెల్లడించారు. లాలూ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో లాలూ […]