CM Jagan: నెలరోజుల్లో రూ.లక్ష కోట్లతో రాజధాని కట్టడం సాధ్యమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. రాజధాని అమరావతిపై తనకు ప్రేమ ఉందని.. ప్రేమ ఉంది కాబట్టే అమరావతిలో తాను ఇల్లు కట్టుకున్నానని.. న్యాయరాజధానిగా అమరావతి కొనసాగాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలు దేనికవే ప్రత్యేకమైనవని జగన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందన్నారు. నెల రోజుల్లో రూ.లక్ష కోట్లతో రాజధాని కట్టేయాలని కోర్టులెలా చెప్తాయని జగన్ ప్రశ్నించారు.
అమరావతిలో రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాల కోసమే రూ.లక్ష కోట్లు ఖర్చవుతాయని గత ప్రభుత్వమే లెక్కలు కట్టిందని.. ఇంకా బిల్డింగ్ వంటి కట్టడాలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహకే అందడం లేదని జగన్ అన్నారు. పెరిగిన ధరలను పరిశీలనకు తీసుకుంటే రాజధాని నిర్మాణానికి 40 ఏళ్లు పడుతుందన్నారు. హైదరాబాద్ లాంటి రాజధానులు కట్టాలంటే కేవలం ఐదేళ్లు, 20 ఏళ్లు సరిపోవని.. కొన్ని వందల ఏళ్లు పడుతుందని జగన్ అన్నారు.
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
గత ప్రభుత్వం రాజధానిని కేవలం గ్రాఫిక్స్‌కే పరిమితం చేసిందని జగన్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలు నచ్చలేదు కాబట్టే ప్రజలు తమకు ఘన విజయం అందించారని జగన్ పేర్కొన్నారు. శాసనసభ ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయించలేవన్నారు. వికేంద్రీకరణ వల్ల ఏపీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీనే చెప్పిందని తెలిపారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చామన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!