దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా […]
పాకిస్థాన్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 227/3 వద్ద డిక్లేర్ చేయగా పాకిస్థాన్ ముందు 351 పరుగుల టార్గెట్ నిలిచింది. […]
మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మరోసారి ప్రకటన చేయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయగా తాజాగా బీజేపీ కూడా జగన్ ప్రకటనను తప్పుబట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటపై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా మడం తిప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అమరావతి రాజధానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కట్టుబడి ఉందని ఆయన […]
దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ అందరూ ఎదురు చూస్తున్న మూవీ రౌద్రం రణం రుధిరం. అదే ఆర్.ఆర్.ఆర్ మూవీ. మరికొద్దిగంటల్లో విడుదల కానున్న ఈ మూవీపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడం, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా […]
ఇటీవల సోషల్ మీడియాలో వుడెన్ ట్రెడ్ మిల్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా దీని గురించే నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. సహజంగా ఇంట్లోనే ఉండి వ్యాయమం చేసే పరికరాల్లో ముఖ్యమైనది ట్రెడ్‌మిల్. ఇది నడక, జాగింగ్, రన్నింగ్ వంటి వాటిని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే అత్యుత్తమ పరికరం. ఇలాంటి పరికరాన్ని ఓ వ్యక్తి ఇనుము, ఇతర లోహాలతో కాకుండా కేవలం చెక్కతో తయారు చేశాడు. ఈ వుడెన్ ట్రెడ్ మిల్‌ను తయారుచేసిన వ్యక్తిని అందరూ […]
ఏపీకి మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలు ఉండాలని.. ఏ వ్యవస్థ అయినా వారి పరిధిలోనే పనిచేయాలని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సిందని బొత్స కామెంట్ చేశారు. దమ్ముంటే టీడీపీ శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరమని చెప్పాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీడీపీ వాళ్లకు ఉత్సాహంగా ఉంటే రాజీనామాలు చేయమని చెప్పాలన్నారు. రాజధాని పరిధిలో మిగిలిన 7,300 […]
మరికొద్ది గంటల్లో ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా కోసం అటు మెగా అభిమానులు.. ఇటు నందమూరి అభిమానులు ఎన్నాళ్ల నుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఈ మూవీకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. అయితే RRR అంటే రణం రుధిరం రౌద్రం అని చాలామందికి తెలుసు. కానీ ప్రముఖ తెలుగు కార్టూనిస్ట్ మృత్యుంజయ్ తన కార్టూన్ ద్వారా RRR అంటే కొత్త […]
తెలంగాణలో టీచర్ల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గురువారం రాత్రి తెలంగాణ సర్కారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని ఈ నెల 25 నుంచి tstet.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. […]
ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణ చర్చ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు. అసెంబ్లీలో ఈరోజు మూడు రాజధానుల ముచ్చట తెచ్చి మూడు ముక్కల ఆటకు మళ్లీ శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. భావితరాల భవిష్యత్‌పై ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతిపై ప్రేమ ఉంటే ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా అని.. మంచి మనసు ఉండాలని చంద్రబాబు హితవు పలికారు. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో […]
పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాకు ఇది నిజంగా చేదువార్తే. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌కు గురైన చోట బంగ్లాదేశ్ మాత్రం చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ విజయం సాధించింది. బుధవారం రాత్రి సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్క మ్యాచ్ […]