విశాఖ జిల్లా పాయకరావుపేటలో కులధ్రువీకరణ పత్రాల స్కాం వెలుగుచూసింది. పాయకరావుపేట నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా బీసీ-డి కులానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ధృవీకరణ పత్రాలలో తప్పులు రావడంతో తహసీల్దార్ అంబేద్కర్‌ను బాధితులు ఆశ్రయించారు. అధికారుల పరిశీలనలో ఇవి నకిలీవిగా స్పష్టం కావడంతో అసలు విషయం బహిర్గతం అయ్యింది. విశాఖ కేంద్రంగా 27 మీ సేవా కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. అయితే తనకు సంబంధం లేకుండా నకిలీ ధ్రువపత్రాలను మంజూరు […]
ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త అందించింది. ఐపీఎల్ 2022 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాలలో చూసేందుకు అభిమానులకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం 25 శాతం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటన చేసింది. దీంతో రెండేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లను క్రీడాభిమానులకు స్వయంగా వీక్షించే అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మార్చి 23 మధ్యాహ్నం నుంచి టిక్కెట్ సేల్స్ ప్రారంభమైనట్లు ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. కాగా ఐపీఎల్ 15వ సీజన్‌లో […]
ఏపీ అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్‌లకు అనుమతి ఇచ్చారని.. ఈ బ్రాండ్‌లన్నీ చంద్రన్న కానుకలే అని జగన్ ఆరోపించారు. 2019 తర్వాత ఏపీలో ఒక్క మద్యం బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లు లేనే లేవని, ఆయా బ్రాండ్లు ఉన్నట్లు సోషల్ […]
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గతంలో […]
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు, టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 ఐపీఎల్ సీజన్‌కు ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తాడని వెల్లడించాడు. తనపై ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈ సీజన్‌కు విరాట్ కోహ్లీ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకున్నాడని అశ్విన్ అన్నాడు. దీంతో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా డుప్లెసిస్‌ను ఎంపిక చేయడం మంచి పరిణామమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. […]
అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూను ప్రతిపాదిస్తూ బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉర్దూను అధికార భాషగా గుర్తించేలా చేసిన సీఎం జగన్‌కు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఏపీలో కల్తీసారా మరణాల అంశంలో శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సారా మరణాలు సహజ మరణాలు కాదని.. అవి ప్రభుత్వ […]
ప్రముఖ టూత్‌పేస్ట్ సెన్సోడైన్ కంపెనీకి సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ టూత్‌పేస్ట్ కంపెనీ ప్రకటన ప్రజలను పక్కదోవ పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. వారం రోజుల్లో ఈ టూత్‌పేస్ట్‌కు సంబంధించిన యాడ్‌ను నిలిపివేయాలని కంపెనీని సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సెన్సోడైన్ కంపెనీకి రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. టీవీల్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై ప్రసారమవుతున్న సెన్సోడైన్ ప్రకటనలను సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సుమోటోగా స్వీకరించింది. ప్రపంచ […]
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టిక్కెట్ రేట్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ గురించి తాను ఒకే ఒక్క మాట చెబుతానని.. మీడియా వాళ్లు రెండో ప్రశ్న అడగడానికి వీల్లేదు అంటూ కామెంట్ చేశారు. సినిమా టికెట్ల ఒక్క విషయమే కాదు అది ఏ […]
ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన వెంటనే జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని స్పీకర్ ముందే హెచ్చరించినా టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ పలువురు టీడీపీ నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ […]