Nara Lokesh: మూడు రాజధానులు కావాలంటే.. 175 జిల్లాలు చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా మంత్రులు కోర్టులపై వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ తప్పుబట్టారు. కేవలం మూడు రాజధానుల విషయంలో మాత్రమే శాసనసభలకు అధికారం లేదని కోర్టు చెప్పిందని లోకేష్ గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనేది పార్లమెంట్ చట్టం ద్వారా జరిగిందని.. పార్లమెంట్ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానులు కావాలనుకుంటే.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 175 జిల్లాలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ఏపీ కేబినెట్‌లో 90 శాతం టెన్త్ ఫెయిలైన బ్యాచ్ ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మూడేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురానివారు.. ఇప్పుడు జిల్లాల విభజన చేస్తే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే.. ఏపీకి మాత్రం ఒక్క పరిశ్రమ కూడా రాని దుస్థితి నెలకొందన్నారు. పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేక.. ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చారని.. కొత్త జిల్లాల వల్ల ఉపయోగం ఏంటని.. ఒక్క ఉద్యోగం అయినా వస్తుందా అని లోకేష్ నిలదీశారు.
Also Read
మరోవైపు వైసీపీ నేతల కంటే ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబన్‌లే నయమని లోకేష్ వ్యాఖ్యానించారు. పదో తరగతిలో పేపర్లు ఎత్తుకెళ్లిన బ్యాచ్.. పదో తరగతి చదువుతున్న నిరుపేద మైనారిటీ విద్యార్థినిని ఏకంగా వెంటాడి వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన నీచ చరిత్ర అని ఆరోపించారు. బంగారు భవిష్యత్ ఉన్న చదువుల తల్లి మిస్బా మరణానికి కారణమైన వైసీపీ నేత సునీల్, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!