Viral News: వుడెన్ ట్రెడ్‌మిల్.. దీనికి కరెంట్ కూడా అవసరం లేదండోయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సోషల్ మీడియాలో వుడెన్ ట్రెడ్ మిల్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా దీని గురించే నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. సహజంగా ఇంట్లోనే ఉండి వ్యాయమం చేసే పరికరాల్లో ముఖ్యమైనది ట్రెడ్‌మిల్. ఇది నడక, జాగింగ్, రన్నింగ్ వంటి వాటిని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే అత్యుత్తమ పరికరం. ఇలాంటి పరికరాన్ని ఓ వ్యక్తి ఇనుము, ఇతర లోహాలతో కాకుండా కేవలం చెక్కతో తయారు చేశాడు. ఈ వుడెన్ ట్రెడ్ మిల్‌ను తయారుచేసిన వ్యక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.
చెక్కతో తయారు చేసిన వుడెన్ ట్రెడ్ మిల్ యాంత్రిక ట్రెడ్ మిల్‌లాగానే పని చేస్తుంది. ఈ వుడెన్ ట్రెడ్‌మిల్ ఉపయోగించడానికి కరెంట్, ఛార్జింగ్, బ్యాటరీ లాంటి ఏవి అవసరంలేదు. అతి తక్కువ ఖర్చుతో ఉపయోగకరమైన పరికరాన్ని తయారు చేసిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. అయితే ఈ వ్యక్తి తెలంగాణకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ వుడెన్ ట్రెడ్‌మిల్‌ను సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయారు. వావ్ అంటూ ట్విట్టర్‌లో తన స్పందన తెలియజేశారు. సదరు వ్యక్తి వివరాలు తెలుసుకోవాలని తెలంగాణ నూతన ఆవిష్కరణల ప్రోత్సాహక విభాగం టీ వర్క్స్‌కు సూచించారు. చెక్కలతో ట్రెడ్ మిల్ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని తెలిపారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఈ వుడెన్ ట్రెడ్‌మిల్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తుండగా.. కొందరు మాత్రం చెక్క ట్రెడ్‌మిల్ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్‌తో నడిచే ట్రెడ్‌మిల్‌తో పోలుస్తూ ఈ వుడెన్ ట్రెడ్‌మిల్ అంత సమర్థంగా పని చేయకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
Wow! 👏👏 @TWorksHyd please connect & help him scale up https://t.co/FVgeHzsQx8
— KTR (@KTRBRS) March 18, 2022
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!