IPL 2022: లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ మెరుపులు.. ముంబైపై ఢిల్లీ అద్భుత విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 15వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది. పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లలిత్ యాదవ్ (48 నాటౌట్), అక్షర్ పటేల్ (38 నాటౌట్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి ఢిల్లీ జట్టును గెలిపించారు. దీంతో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ బూడిద పాలైపోయింది. పృథ్వీ షా (38), సీఫర్ట్ (21) రాణించారు. ముంబై ప్రధాన బౌలర్ బుమ్రా 3.2 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బసిల్ తంపి 3 వికెట్లు పడగొట్టినా ఫలితం దక్కలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 177/5 స్కోర్ సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా రోహిత్ (41) అవుటైనా ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 81 పరుగులు చేశాడు. తిలక్ వర్మ (22) కాసేపు సహకారం అందించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్‌దీప్‌కు 3 వికెట్లు పడ్డాయి. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!