హాట్ హాట్‌గా సాగుతున్న సమ్మర్‌లో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ కూల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతోంది. ఇప్పటికే ఐపీఎల్ సమరం ప్రారంభమైంది. మే 29 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సుమారు మూడు నెలల పాటు ఐపీఎల్ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలా చూడాలి అంటూ ఆలోచనలో పడ్డారు. టీవీ లేదా డిస్నీ హాట్‌స్టార్ లేని వారు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు. అయితే వాళ్లు తమ ఫోన్‌లో జియో టీవీ లేదా ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో, ఎయిర్‌టెల్ యూజర్లు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలాంటి డబ్బులు ఖర్చు చేయకుండా ఉచితంగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియోను క్లిక్ చేసి చూడండి.