Israel Prime minister: భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన వాయిదా.. కారణం ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 5 వరకు బెన్నెట్ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ పర్యటన వాయిదా పడిందని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బెన్నెట్ ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. తమ ప్రధాని భారత్‌లో పర్యటించే కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు
కాగా ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తొలిసారిగా భారత్ రానున్నారు. ఇజ్రాయెల్, భారత్ దేశాల మధ్య మైత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్‌ను మోదీ ప్రత్యేకంగా భారత్‌కు ఆహ్వానించారు. వ్యవసాయం, ఇరిగేషన్, వాణిజ్యం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
- Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
- Nvidia: చైనాకు AI చిప్‌లు చేరకుండా అమెరికా వ్యూహం.. నాలుగు దేశాలకు ఎన్విడియా షాక్!
- US Birthright Citizenship Row: ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై అమెరికా కోర్టు కీలక తీర్పు
తాజావార్తలు
-
Tollywood: 2027 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం.. బరిలో ఏడు సినిమాలు
-
Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..
-
Paternity Leave: తమిళనాడులో తండ్రులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు!
-
Vasantha Haimavathi Passes Away: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫ్యామిలీలో విషాదం..
-
GST Registration: వ్యాపారులకు కేంద్రం ఊరట.. ఇక క్షణాల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!