GO 252 : ఒకే వృత్తి.. రెండు కార్డులా.? జీవో 252పై జర్నలిస్టుల సమరభేరి
- జీవో 252పై జర్నలిస్టుల ఆగ్రహం
- డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- సవరణ చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GO 252 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అక్రిడిటేషన్ల జీవో నెంబర్ 252పై జర్నలిస్టు లోకం భగ్గుమంది. ఈ జీవోలో ఉన్న అసంబద్ధ నిబంధనలను సవరించాలని, డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టు సంఘాలు భారీ నిరసనలు చేపట్టాయి. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులు, చిన్న పత్రికల ప్రతినిధులు ఈ ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ వర్సెస్ మీడియా కార్డు: వివాదం ఏంటి?
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం.. ఫీల్డ్ రిపోర్టర్లకు ‘అక్రిడిటేషన్ కార్డు’, డెస్క్ జర్నలిస్టులకు కేవలం ‘మీడియా కార్డు’ జారీ చేయాలని నిర్ణయించింది. దీనిపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ఒకే వృత్తిలో ఉన్న వారిని రిపోర్టర్లు, డెస్క్ అని రెండు వర్గాలుగా విభజించడం జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడమేనని వారు మండిపడుతున్నారు. మీడియా కార్డు వల్ల రైల్వే, బస్సు పాస్ రాయితీలు, టోల్ గేట్ మినహాయింపులు వంటి కనీస ప్రయోజనాలు కూడా అందే అవకాశం లేదని డెస్క్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నట్లుగానే డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తిస్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నేతృత్వంలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ల ముందు డెస్క్ జర్నలిస్టులు జీవో 252పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా DJFT నాయకులు మాట్లాడుతూ.. కొత్త జీవో వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రధాన డిమాండ్లు:
- జర్నలిస్టులను విభజించే జీవో 252ను వెంటనే సవరించాలి.
- డెస్క్ జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలి.
- అక్రిడిటేషన్ కమిటీలలో డెస్క్ జర్నలిస్టులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి.
- చిన్న, మధ్య తరహా పత్రికలకు, వెబ్ సైట్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి.
జర్నలిస్టు సంఘాలైన టీడబ్ల్యూజేఎఫ్ (TWJF), డీజేఎఫ్ టీ (DJFT), టీయూడబ్ల్యూజే (TUWJ 143), హెచ్ యూజే వంటి సంస్థలు ఐక్యంగా ఈ పోరాటాన్ని సాగిస్తున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే, రాజధాని హైదరాబాద్‌లో ‘మహా ధర్నా’ చేపడతామని, రాష్ట్రవ్యాప్త దీర్ఘకాలిక ఆందోళనలకు వెనకాడబోమని జర్నలిస్టు నాయకులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!