కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ శుక్రవారం వెల్లడించింది. టీకా ఒప్పంద కంపెనీలకు సరఫరా పూర్తి కావడం, టీకాకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. మరోవైపు వైరస్ వ్యాప్తి తగ్గడం, దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో కరోనా టీకాలకు డిమాండ్ తగ్గినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో టీకా తయారీ కేంద్రాల నిర్వహణ పనులు చేపడతామని.. ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే ప్రక్రియలపై దృష్టి సారిస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. టీకాల ఉత్పత్తిలో అధునాతన టెక్నాలజీ అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి నాణ్యత విషయంలో తాము ఎక్కడా రాజీ పడేది లేదని స్పష్టం చేసింది. ఏడాది నుంచి నిర్విరామంగా కొవాగ్జిన్ ఉత్పత్తి చేశామని చెప్పింది.
https://ntvtelugu.com/blood-pressure-and-sugar-patients-are-increased-in-andhra-pradesh/