ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన తమ జట్టును ఓపెనర్ కేఎల్ రాహుల్ (68), ఆల్‌రౌండర్ దీపక్ హుడా (51) హాఫ్ సెంచరీలతో రాణించి తమ జట్టుకు మంచి స్కోరు అందించారు. కేఎల్ రాహుల్ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 68 పరుగులు చేశాడు. దీపక్ హుడా 33 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, షెపర్డ్, నటరాజన్ తలో రెండు వికెట్లు సాధించారు. 170 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి. ఇప్పటివరకు సన్‌రైజర్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో విలియమ్సన్ నేతృత్వంలోని జట్టు గెలవాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు.
https://www.youtube.com/watch?v=kUOWuXAdxw4