విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నున్న పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు విధించారు. తమ కుమార్తె కనిపించలేదన్న బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
మరోవైపు శుక్రవారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వాసిరెడ్డి పద్మ ఆస్పత్రి లోపలకు వెళ్తుంటే టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాస్పత్రికి వస్తుండడంతో బోండా ఉమ సహా పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు.
గ్యాంగ్ రేప్ ఘటన నిందితురాలిని హోంమంత్రి తానేటి వనిత కూడా పరామర్శించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని ఆమె పరామర్శించనున్నారు. కాగా ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు.
Vijayawada: ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. యువతిపై గ్యాంగ్‌రేప్