ఏపీ సీఎం జగన్ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు. సీఎం అయిన తరువాత జగన్ లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగానే పరిమితమైంది. అయితే ఇప్పుడు సీఎం హోదాలో జగన్ దావోస్ వెళ్లనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం జగన్ వారికి వివరించనున్నారు
కాగా ఈ సమ్మిట్‌కు సంబంధించి గతంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. వాస్తవానికి ఈ సమ్మిట్ గత డిసెంబరులోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరిగిన కారణంగా సమ్మిట్ నిర్వహణ వాయిదా పడింది. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్‌గా జరుగుతున్నాయి. ఇప్పుడు నేరుగా జరగబోతున్నాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో ప్రతి ఏడాది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది దావోస్ వెళ్లేవారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం దావోస్‌లో జరిగే సమ్మిట్‌లకు హాజరవుతుంటారు.
Andhra Pradesh: వైసీపీతో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదన.. జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా?