ఏపీలో పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త అందించింది. గురువారం పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ప్రకటన చేసింది. పరీక్షల సమయంలో విద్యా కేంద్రం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసిన అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం ఉచితంగా చేయవచ్చని సూచించింది. ఉచిత ప్రయాణం చేయాలంటే విద్యార్థులు హాల్‌టిక్కెట్‌ను చూపించాలని తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పరీక్షలు రాయడానికి వెళ్లే విద్యార్థులు పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్షలు నిర్వహించే తేదీల్లో మాత్రమే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు డిపోల మేనేజర్లు జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చించి విద్యార్థులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ఏపీలో ఈనెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది 6.22 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Andhra Pradesh: దేవాదాయ శాఖలో రెవెన్యూ అధికారుల పెత్తనానికి బ్రేక్