క్రెడిట్ కార్డుల జారీని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరింత కట్టుదిట్టం చేసింది. కస్టమర్ల సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని అన్ని బ్యాంకులు, కంపెనీలను ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ విషయాన్ని ఉల్లంఘిస్తే కస్టమర్ నుంచి వసూలు చేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది.
అంతేకాకుండా క్రెడిట్ కార్డులకు సంబంధించి రుణాల వసూలు కోసం సంస్థలు కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు దిగరాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో కార్డుహోల్డర్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినా సహించే ప్రసక్తే లేదని తెలిపింది. క్రెడిట్ కార్డుల జారీని బ్యాంకులు సేవలతో ముడి పెట్టొద్దని కూడా హితవు పలికింది. కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై తప్పనిసరిగా కోబ్రాండెడ్ కార్డు అని ఉండాలని కోరింది. కాగా ఈ ఏడాది జులై 1 నుంచి తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది.
Jio Fiber: బంపర్ ఆఫర్.. రూ.200 అదనంగా చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్