రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు, ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో మూడు సెంచరీలు చేశాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 116 పరుగులు చేసి చివరి ఓవర్‌లో అవుటయ్యాడు. ఈ క్రమంలో బట్లర్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్‌తో కలిసి 155 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని బట్లర్ నమోదు చేశాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇదే అత్యధిక ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్. గతంలో రహానె, వాట్సన్ కలిసి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పుడు ఆ రికార్డును బట్లర్-పడిక్కల్ జోడీ అధిగమించింది.
మరోవైపు ఈ సీజన్‌లో బట్లర్ ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడు. తాజాగా ఢిల్లీపై చేసిన సెంచరీ మూడో కావడంతో ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్ రెండో స్థానంలో నిలిచాడు. గతంలో 2016 సీజన్‌లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మరోవైపు ఓవరాల్ ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇది నాలుగో సెంచరీ. ఈ జాబితాలో క్రిస్ గేల్ ఆరు సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ఐదు సెంచరీలతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. నాలుగు సెంచరీలతో వాట్సన్, వార్నర్, బట్లర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో బట్లర్ 492 పరుగులు చేశాడు. 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 16 మ్యాచ్‌లలో 973 పరుగులు చేయగా.. బట్లర్ ప్రస్తుత ఊపును కొనసాగిస్తే కొహ్లీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజస్థాన్ ఇంకా ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
https://www.youtube.com/watch?v=Ro0GM2W9tVI
IPL 2022: ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్‌లో నోబాల్ వివాదం.. బ్యాటింగ్ ఆపేయాలని పంత్ సైగలు