Husband Murder: ప్రియుడి మోజులో భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని మహిళలకు ఏమైందో అర్ధం కావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలను కూడా వివాహేతర సంబంధాల కోసం చంపేస్తున్నారు. మహిళల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు కారణమేంటి? ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా మహిళలు తమ భర్తలను చంపే కల్చర్ పెరిగిపోతోంది. ఇటీవల కర్నూలు జిల్లా కోడుమూరులోనూ ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పిల్లలను అనాధలను చేసింది. తాజాగా తెలంగాణలోని వనపర్తిలో కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ ఓ భార్య హత్య చేయించింది. ఆ తరువాత దొరక్కుండా డెడ్‌బాడీని హైదరాబాద్‌కు తీసుకొచ్చి పాతిపెట్టింది. పోలీసులు రంగంలోకి దిగడంతో సుపారీ పెళ్లాం గుట్టు రట్టయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. వనప్తరి జిల్లాలో కట్టుకున్న భర్తను ఓ భార్య సుపారీ ఇచ్చి చంపేసింది. గాంధీ నగర్‌కు చెందిన బాల స్వామికి లావణ్య అనే మహిళతో 10 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వీరి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. బాలస్వామి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం సంతోషంగానే సాగిపోతోంది. ఇదే సమయంలో నవీన్ అనే యువకుడితో లావణ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే సమయంలో 5 నెలల క్రితం బాల స్వామి పొలం అమ్మడంతో 30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో ప్రియుడితో చెక్కేయాలనుకున్న లావణ్య.. భర్తను చంపేందుకు పక్కా ప్లాన్ వేసింది. అర్ధరాత్రి వేళ మైసమ్మ గుడి దగ్గరకు వెళ్లి కోడిపుంజును కోసి రావాలని భార్య చెప్పడంతో బాలస్వామి నమ్మేశాడు. అక్కడికి వచ్చిన బాలస్వామిని బలవంతంగా కారులో ఎక్కించి గొంతు నులిపి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్ బాలాపూర్ శివారులోని స్మశాన వాటిక సమీపంలో పూడ్చిపెట్టారు.
Also Read
లావణ్య కూడా కనిపించక పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. లావణ్య సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా వనపర్తి శివారులో ఆమెను పట్టుకున్నారు. లావణ్య ప్రియుడు నవీన్, మరో ముగ్గురు నిందితులను కూడా అదువులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. విచారణలో శవాన్ని ఎక్కడ పాతి పెట్టారో కనుక్కుని.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!