స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ప్రైవసీపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్‌రికార్డింగ్ యాప్‌లను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ తెలిపింది. వీటిని మే 11 నుంచి అమల్లోకి తెస్తామని పేర్కొంది. కాల్ రికార్డింగ్‌కు ఫీచర్‌కు మొదటి నుంచి గూగుల్ వ్యతిరేకంగానే గళం వినిపిస్తోంది. తన సొంత డెయిలర్ అప్లికేషన్‌లో సైతం కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు రికార్డ్ అవుతుంటే గూగుల్ ఒక శబ్దాన్ని పుష్ చేసేది. తర్వాత రికార్డింగ్ ఫీచర్‌ను తన డెయిలర్‌లో డిలీట్ చేసింది.
అయితే థర్డ్ పార్టీ యాప్స్ మాత్రం కాల్ రికార్డింగ్ ఏపీఐని వినియోగించుకుని కాల్స్‌ను రికార్డ్ చేస్తున్నాయి. దీంతో యాజర్ల ప్రైవసీ దెబ్బతింటోంది. కొన్నిసార్లు ఈ ఫోన్ రికార్డింగ్ లు బ్లాక్ మెయిలింగ్‌కు ఆయుధాలవుతున్నాయి. ఇప్పుడు వాటికి చెక్ పెట్టాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీఐ సపోర్ట్‌ను గూగుల్ తొలగిస్తోంది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ ఏవీ కాల్స్‌ను రికార్డ్ చెయ్యలేవు. స్మార్ట్‌ఫోన్‌తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీ ఫోన్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్ లేకపోతే మాత్రం ఇకపై గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం కుదరదు. యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్అన్నింటినీ నిలిపేయాలని గూగుల్ నిర్ణయించింది.
Jio Fiber: బంపర్ ఆఫర్.. రూ.200 అదనంగా చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్