అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 1.23 లక్షల ఇళ్లపట్టాల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30.70 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని వెల్లడించారు. గజం 12 వేలికే చోట రూ.6 లక్షలు విలువైన ఇళ్లస్థలాన్ని పేదలకు ఇచ్చామని తెలిపారు. ఇంటి నిర్మాణం, మౌలిక సదుపాయాలతో కలిపి రూ.10 లక్షల వరకు […]
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీక్ సూత్రధారి రాజేష్ సహా 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల గురించి జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ప్రధాన వ్యక్తి టి.రాజేష్ అని తెలిపారు. పేపర్ లీకేజీ సమాచారం వచ్చిన వెంటనే తహసీల్దార్ ఆధ్వర్యంలో డీఈవో, పోలీస్ అధికారులు విచారణ చేపట్టినట్లు […]
ఉక్రెయిన్-రష్యా యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతుందే కానీ తగ్గుతున్న సూచనలు కనిపించుట లేదు. యుద్ధం మొదలై రెండు నెలలు దాటింది. శాంతి సాధన దిశగా అడుగు కూడా ముందుకు పడే సూచనలు లేవు. పైగా రష్యా పదే పదే అణు జపం చేస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్నట్టుగా మాట్లాడుతోంది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఆయుధ సాయం ఇలాగే కొనసాగితే పుతిన్ ఏం చేస్తాడో ఊహించను కూడా ఊహించలేం. ఇప్పుడు జరుగుతోంది పేరుకే ఉక్రెయిన్- రష్యా యుద్ధం. […]
హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో థర్మో ఫిషర్స్ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటైందని తెలిపారు. థర్మో షిషర్స్ ఇండియా సంస్థ పరిశోధన కోసం ప్రతి ఏటా 1.4 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధిస్తోందని పేర్కొన్నారు. 2030 లోపు […]
ఏపీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్ పరిశీలించారు. వైఎస్ఆర్ పార్కులో దివంగత నేత ఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అసభ్యకర పదజాలంతో దూషించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఆడియో అంశంపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి స్పందించారు. తాండూరులోని భావిగి భద్రేశ్వర స్వామి జాతర కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని.. ఈ విషయంలోనే తాను సీఐతో మాట్లాడానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలిపారు. కానీ వైరల్ అవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. తాను సీఐని దూషించలేదని […]
అమరావతి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ ఆర్ఐపై మట్టి మాఫియా ఎదురు కేసు పెట్టడంపై లేఖలో వర్ల రామయ్య అభ్యంతరం తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు పెట్టారంటే మట్టి మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోందని వర్ల రామయ్య ఆరోపించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడి రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్టు చేయకుండా బాధితుడైన ఆర్ఐపై కేసు నమోదు చేయడం […]
ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే జగన్ ఉండనున్నారు. ఈనెల 30న శనివారం జరగనున్న జ్యుడిషీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో […]
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సందర్భంగా ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఆస్తులను ప్రకటించిన కేసీఆర్ తన కుటుంబం ఆస్తులను ఎందుకు ప్రకటించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోజుకో మాట […]