పక్కరాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, నీళ్లు లేవని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ లాగే కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. నీళ్లు, కరెంట్, రోడ్లు ఉన్నాయో లేదో విజయవాడకు వచ్చి చూస్తే అర్ధమవుతుందన్నారు. కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. అలా అభివృద్ధి ప్రాంతంగా మారిన హైదరాబాద్ […]
హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలపై సెటైర్లు వేశారు. కొద్దిరోజుల క్రితం తన మిత్రుడు పండగకు పక్క రాష్ట్రం వెళ్లి వచ్చారని.. వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశారని.. అక్కడ నాలుగు రోజులు ఉండగా కరెంట్ లేదని.. నీళ్లు లేవని.. రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్లను నాలుగురోజులు బస్సుల్లో పక్క రాష్ట్రానికి పంపాలని.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం […]
గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై వార్నర్ 26 బంతుల్లో 8 ఫోర్లు సహాయంతో 42 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా జట్టుపై అతడు వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆలగాడిగా వార్నర్ రికార్డు సృష్టించాడు. గతంలో పంజాబ్‌పై ఓవరాల్ ఐపీఎల్‌లో […]
ఏపీలోని పలు ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయలంటూ సీఎస్ సమీర్‌శర్మకు ఆయన లేఖ రాశారు. కుప్పంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సీఎస్‌కు రాసిన లేఖకు చంద్రబాబు జత చేశారు. చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వే నంబరు 104తో పాటు […]
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న గొడవలతో తమ పార్టీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం చూస్తే బాధేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా కూడా చేస్తానన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితులపై పడుతున్నారని నారాయణస్వామి అన్నారు. వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని అభిప్రాయపడ్డారు. […]
చంద్రబాబు, లోకేష్‌కు చీర పంపిస్తామని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రోజా తనకు చీర పంపిస్తా అంటున్నారని.. ఒకవేళ ఆమె తనకు చీర పంపిస్తే తాను తీసుకుని గౌరవప్రదంగా తన తల్లికి ఇస్తానని లోకేష్ తెలిపారు. అయితే చీర కట్టుకునే మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన మంత్రి రోజా మహిళా సమాజానికి ఆమె క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. […]
హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వివాహం జరిగిన పది నెలలకే వరకట్న వేధింపుల కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నిఖిత ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ ఫ్లాట్ నెంబర్ 158లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదయ్‌తో నిఖితకు వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 10 లక్షల నగదుతో పాటు 35 తులాల బంగారాన్ని నిఖిత […]
దేశంలో 12 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమలకు వారంలో 2-3 రోజులు పవర్ హాలిడే ప్రకటించడంతో పాటు ఇళ్లకు గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. వేసవి కారణంగా ఏపీలో డిమాండ్ పెరిగిపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ కొరత నెలకొంది. దీంతో విద్యుత్ వినియోగంపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించాయి. ఇప్పటికే పరిశ్రమలపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించగా.. […]
గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.450 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,370గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48వేలుగా నమోదైంది. అటు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.వెయ్యి తగ్గి రూ.69వేలకు చేరింది. […]