టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు పలుచోట్ల భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనలు విధించారు. దీంతో ఏ పార్టీ నేతలు ఫ్లెక్సీలు పెట్టినా ఊరుకోవడం లేదు. తాజాగా అధికార పార్టీ నేతలే భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు విధించారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి రూ.65వేలు, మంత్రి […]
ఈ ఏడాది తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో మే 4న ప్యారిస్ చేరుకుంటారు. ఈ మేరకు మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇండియా జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ […]
ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఈ స్థాయిలో తంటాలు పడుతుండటం కెరీర్‌లో బహుశా ఇదే తొలిసారి. దీంతో కోహ్లీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. ఒకరకంగా కోహ్లీ టీమ్‌కు భారంగా మారాడనే చెప్పాలి. ఓపెనర్‌గా వచ్చినా, వన్‌డౌన్‌లో వచ్చినా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడా వచ్చినా కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ […]
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్‌రేప్ ఘటన మరువక ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ బతుకుతోంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి […]
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుతున్నా దేశంలో ఆ భారాన్ని రైతులపై పడనీయబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు కొనుగోలు చేసే డీఏపీ, పాస్పటిక్, పొటాషియం ఎరువులపై ఏకంగా 60 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏపీ బస్తాపై ప్రస్తుతం ఉన్న రూ.1,850 సబ్సిడీని రూ.2,501కి పెంచింది. ఇది గత ఏడాది కంటే 50 […]
ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… గురువారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=v4Wqt0vdjxU
★ నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. సబ్బవరం మండలం పైడివాడలో 1.23 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్న జగన్.. పార్క్ పైలాన్‌ను ప్రారంభించనున్న జగన్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న జగన్ ★ విజయవాడ: ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం.. అరగంట పాటు గవర్నర్‌తో భేటీ కానున్న జగన్ ★ చిత్తూరు: నేడు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి […]
దేశవ్యాప్తంగా సామాన్యులపై వంట నూనెల ధరల భారం అధికంగా పడుతోంది. తెలుగు రాష్ట్రాలలో అయితే గత వారం రోజుల్లో లీటర్ వంటనూనె ధర రూ.10 మేరకు పెరిగింది. మంగళవారం ఒక్క రోజే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.4 పెరిగింది. ఒకప్పుడు రూ.100 లోపు ఉండే వంట నూనె ధర ఇప్పుడు రూ.200కు పైగా పలుకుతోంది. కుకింగ్ ఆయిల్స్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అదనుగా తీసుకుని వ్యాపారులు కృత్రిమ […]
కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మోదీ ఆరోపించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా.. రాష్ట్రాలు తగ్గించలేదన్నారు. రాష్ట్రాల తీరు వల్లే ధరలు పెరుగుతున్నాయని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని.. అప్పుడే ప్రజలపై పెట్రోల్ ధరల […]
ఏపీలో బుధవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయ్యిందని వదంతులు రాగా కలెక్టర్ హరినారాయణ స్పందించి వాటిని ఖండించారు. తాజాగా నంద్యాల జిల్లాలోనూ టెన్త్ ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాచ్ మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3 […]