తెలంగాణలో జూన్ రెండో వారం నాటికి కరోనా కేసుల ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 40 కేసులు నమోదవుతున్నాయి. వీటి సంఖ్య జూన్ రెండో వారం నాటికి రోజుకు 2,500 నుంచి 3వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ దశను ఫోర్త్ వేవ్ అని కూడా భావించవచ్చని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు స్వల్పంగానే ఉంటాయన్నారు. ఫోర్త్ వేవ్ […]
టీడీపీలో విషాదం నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-94లో నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కాగా వైసీపీ ఆవిర్భావం తర్వాత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఆయన […]
హైదరాబాద్నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులో ముస్లింలు, మత పెద్దలు […]
గురువారం నిర్వహించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖ తెలిపింది. సముద్రంలో ఉన్న ఓడలు, పడవలు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన యాంటీషిప్ వెర్షన్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు ఇండియన్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్ వెల్లడించాయి. బ్రహ్మోస్ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలిపాయి. ఈ ప్రయోగాన్ని ఇండియన్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ నెల 19న భారత […]
ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… శుక్రవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=qCTFn_tQdFQ
★ అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష చేపట్టనున్న సీఎం జగన్.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నాడు-నేడు తదితర అంశాలపై చర్చ ★ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరిక.. ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్.. రేపు ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులతో జరుగనున్న న్యాయ సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్ ★ ఈరోజు తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ […]
టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. కేవలం బీజేపీని తిట్టడానికే ఆయన టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించారన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టే కేసీఆర్ బీజేపీని తిట్టడానికి ఈ సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. సాధారణంగా ప్లీనరీలో పార్టీ వ్యవహారాలు, సంస్థాగత ఏర్పాట్లపై చర్చిస్తారని.. కానీ టీఆర్ఎస్ ప్లీనరీ దీనికి విరుద్ధంగా జరిగిందని బండి సంజయ్ విమర్శించారు. 33 రకాల […]
తాండూరులో రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సీఐ రాజేందర్‌రెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారని ఆరోపణలు రావడంతో పోలీస్ అధికారుల సంఘం మండిపడుతోంది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఆడియో వైరల్ కావడం కలకలం రేపింది. అయితే ఆ ఆడియో తనది కాదని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వాదిస్తున్నారు. ఇది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో కేటీఆర్‌తో […]
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. కొందరు అమాయకులు గూగుల్‌లో దొరికే కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేసి దారుణంగా మోసపోతున్నారు. తెలంగాణలో ఓ విద్యార్థి కూడా ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సుంకరి సాగర్ వద్ద కమీషన్ పేరుతో 99,232 రూపాయలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 5వ తేదీన పార్ట్ టైం జాబ్ కోసం సుంకరి […]