ఏపీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్ పరిశీలించారు. వైఎస్ఆర్ పార్కులో దివంగత నేత ఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.