Patnam Mahender Reddy: నేను సీఐని తిట్టలేదు.. ఇది ఎమ్మెల్యే నిర్వాకమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అసభ్యకర పదజాలంతో దూషించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఆడియో అంశంపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి స్పందించారు. తాండూరులోని భావిగి భద్రేశ్వర స్వామి జాతర కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని.. ఈ విషయంలోనే తాను సీఐతో మాట్లాడానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలిపారు. కానీ వైరల్ అవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. తాను సీఐని దూషించలేదని వివరణ ఇచ్చారు.
పోలీసులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. అధికారులంతా తాండూరు రావాలని కోరుకుంటారని.. తాను పోలీసులతో మంచిగా వ్యవహరిస్తానని మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. నకిలీ ఆడియో వ్యవహారంపై కోర్టునే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఇవన్నీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పోలీసులు నోటీసులు ఇస్తే విచారణను ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. కాగా పోలీసులను అసభ్యపదజాలంతో దూషించిన మహేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!