దేశంలో బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీల నేతలు తనను కలిసి తమతో చేతులు కలపాలని కోరినట్లు ప్లీనరీలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే తాను వాళ్లతో రానని స్పష్టం చేసినట్లు వివరించారు. ఎవరినో గద్దె ఎక్కించేందుకు లేదా గద్దె దించేందుకు తాను పనిచేయనని చెప్పారు. గద్దె ఎక్కించాల్సింది రాజకీయ పార్టీలను కాదు అని.. ప్రజలను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదని.. ప్రజల జీవితాలు అని […]
విశాఖలో దారుణం వెలుగు చూసింది. ఉక్కు ఉద్యోగుల జనరల్ ఆసుపత్రిలో ఓ వైద్యుడు నీచంగా ప్రవర్తించాడు. తన వంకరబుద్ధిని బయటపెట్టాడు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన ఓ మైనర్ బాలికపై చీఫ్ డాక్టర్ కపాడియా అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో సదరు బాలిక ఆస్పత్రి బయటకు వచ్చి 100 నంబర్‌కు కాల్ చేసింది. తనపై వెకిలి చేష్టలకు పాల్పడ్డ డాక్టర్‌పై తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు […]
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే పేపర్ లీక్ అంశం స్థానికంగా కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు -1 పేపర్ వాట్సాప్‌లో రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ అంశంపై జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. సోషల్ మీడియాలో బయటకు వచ్చిన పేపర్ చిత్తూరు జిల్లాకు సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అయితే పలమనేరులో పదో తరగతి […]
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సహాయం అందించింది. ఈ మేరకు టీడీపీ నేతలు బోండా ఉమ, వంగలపూడి అనిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా వ్యాఖ్యలకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని.. జగన్ ప్రభుత్వ హయాంలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బ్లూఫిల్మ్‌లలో పాల్గొన్నట్టు స్వయంగా రోజా మీదే అభియోగాలు […]
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని.. అందరికంటే పెద్ద ఉన్మాది చంద్రబాబే అన్నారు. టీడీపీలో ఉన్నంతమంది ఉన్మాదులు దేశంలోనే లేరని రోజా ఆరోపించారు. మహిళ అని చూడకుండా మహిళా ఛైర్‌పర్సన్‌పై చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. రిషితేశ్వరిని పొట్టనపెట్టుకుంది టీడీపీ నేతలు కాదా అని మంత్రి […]
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,927 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం 2,483 కేసులు నమోదు కాగా బుధవారం కేసుల సంఖ్య 2,927కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,65,496కి చేరింది. మరోవైపు కొత్తగా 32 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 2,252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,25,25,563 మంది కరోనా […]
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీకి పలు ప్రశ్నలు సంధించారు. సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తన 8 ఏళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారో మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలను ప్రస్తావిస్తే కేసీఆర్ అసమర్థ పాలనపై వెయ్యి ప్రశ్నలు అడిగినా సరిపోదని ఎద్దేవా చేశారు. అబద్ధాలతోనే […]
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా మారుతోంది. అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తుండటంతో రష్యా సర్కారు మరింత భీకరంగా విరుచుకుపడుతోంది. నాటో దేశాలు తమను కవ్విస్తున్నాయని, ఇందుకు భారీ మూల్యం చెల్లించుకుంటాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోస్ హెచ్చరించారు. ఉక్రెయిన్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మూడో ప్రపంచ యుద్ధం, అణ్వాయుధాల ప్రయోగం తప్పదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై తాము ఇప్పటికీ ఆశాభావంతో […]
హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్‌లు, పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లు ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. ఈ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం 13 తీర్మానాలు చేయనుంది. జాతీయ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ తీర్మానం చేయనున్నారు. వరి కొనుగోలుపై మంత్రి నిరంజన్‌రెడ్డి తీర్మానం చేయనున్నారు. ధరల పెరుగుదలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానం చేయనున్నారు. మరోవైపు కేంద్ర పన్నుల వాటాపై […]
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటా జెండా పండగ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు వారి వారి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగాపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్.. […]