Minister KTR: తెలంగాణలో పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో థర్మో ఫిషర్స్ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటైందని తెలిపారు. థర్మో షిషర్స్ ఇండియా సంస్థ పరిశోధన కోసం ప్రతి ఏటా 1.4 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధిస్తోందని పేర్కొన్నారు.
2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సెంటర్ ఏర్పాటుతో 450 మందికి పైగా ఇంజినీర్లు పనిచేస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. గత నెలలో బోస్టన్‌లో థర్మో ఫిషర్స్ ప్రతినిధులను కలిశానని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. పరిశోధన కేంద్రాల విషయంలో ఆసియాలోనే క్రియాశీలక స్థానంలో ఉన్నామని.. నైపుణ్యం, సామర్థ్యం విషయంలోనూ హైదరాబాద్ నగరానిది ప్రత్యేక స్థానమని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఐడీపీఎల్, ఇక్రిశాట్, సీఎస్‌ఐఆర్ వంటి ఎన్నో పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి వాతావరణం కల్పిస్తున్నామని.. పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
-
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!