దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 3,157 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,82,345కి చేరింది. అటు కరోనా కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కరోనా బారి నుండి 2,723 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,38,976గా […]
పూణె వేదికగా ఆదివారం రాత్రి ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్లు రుతురాజ్ గైక్వాడ్ (99), కాన్వే (85 నాటౌట్) మెరుపుల కారణంగా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అయితే చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు […]
నెల రోజులుగా ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రుయాత్ హిలాల్ కమిటీ ముస్లింలకు కీలక ప్రకటన చేసింది. ఆదివారం నాడు ఆకాశంలో నెలవంక కనిపించలేదని.. దీంతో మంగళవారం రంజాన్ పర్వదినం జరుపుకోవాలని సూచించింది. దీంతో సోమవారం పండగ జరుపుకోవాలని ముస్లింలు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకోగా వాటిని మంగళవారానికి వాయిదా వేసుకున్నారు. అటు తెలంగాణలోని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రంజాన్ పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రార్థనా […]
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు బంధువులు రాగా.. పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తక్షణమే బాధితురాలిని చూపించాలని నిరసన చేపట్టారు. అయితే బాధితురాలి బంధువులతో కలిసి కొండేపి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా బాధితురాలి బంధువులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి కాలికి గాయమైంది. అనంతరం […]
పూణె వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ రెచ్చిపోయింది. బలమైన బౌలింగ్ దళం కలిగి ఉంటుందని పేరున్న సన్‌రైజర్స్ జట్టుపై ఏకంగా 200 పరుగులకు పైగా స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ మినహా మిగతా వారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో చెన్నై టీమ్ 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. అతడు 57 బంతుల్లో 6 ఫోర్లు, […]
మేడే సందర్భంగా విజయవాడలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమ, గద్దె రామ్మోహనం, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ.. మూడేళ్ల జగన్ పాలనలో ఒక కార్మికుడు చనిపోయినా రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికులు దాచుకున్న డబ్బులను కూడా జగన్ సర్కార్ తినేసిందని విమర్శించారు. ఏపీలో మళ్లీ […]
ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేను అని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ఎన్టీవీ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట వాస్తవమే అని.. కానీ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని సమాధానమిచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. తనకు ప్రతి పార్టీలో స్నేహితులు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీలో రంజిత్‌రెడ్డి తనకు […]
ఐపీఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో లక్నో టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలు చేయడంతో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ […]
సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఎస్సై దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. తన తల్లి వికలాంగురాలు అని.. ఆమెకు వికలాంగురాలి పెన్షన్ మంజూరు చేపిస్తానని చెప్పి స్థానిక వైసీపీ నేత దామోదర్ రెడ్డి డబ్బు తీసుకుని మోసం చేశాడని బాధితుడు వేణు ఆరోపించాడు. వైసీపీ నేత దామోదర్ రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన […]
యూజీసీ నెట్ అర్హత పరీక్ష 2022 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్‌ను ఆదివారం నాడు విడుదల చేసింది. 2021 డిసెంబర్, 2022 జూన్ రెండు పరీక్షలకు ఒకే నోటిఫికేషన్‌ను ఎన్టీఏ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. మొత్తంగా 82 సబ్జెక్టులకుగానూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే పరీక్షకు […]